Video: లైవ్‌లో వార్తలు చదువుతుండగా అడ్డువచ్చిన ఈగను ఎవరికీ డౌట్ రాకుండా మింగిన యాంకర్

Viral Video: అదే సమయంలో వార్తలు చదవడంలో ఏ మాత్రం ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఆ యాంకర్ వెంటనే ఆ ఈగను..

దర్శకుడు రాజమౌళి తీసిన ‘ఈగ’ సినిమాలో సుదీప్‌ను ముప్పుతిప్పలు పెడుతుంది ఈగ. ఈ సినిమాలో దాని బారినపడి సుదీప్ ఎన్నో కష్టాలు అనుభవిస్తాడు. నిజజీవితంలోనూ ఓ టీవీ యాంకర్ ను ఇబ్బంది పెట్టాలనుకుంది ఓ ఈగ. అయితే, ఆ ఈగ పప్పులు ఈ యాంకరమ్మ ముందు ఉడకలేదు.

ఓ యాంకర్ లైవ్‌లో న్యూస్ చదువుతుండగా ఓ ఈగ ఆమె ముఖంపై వాలింది. దీంతో ఆమె ఆ ఈగను తినేసి, వార్తలు చదవడాన్ని కొనసాగించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. పనిలో ఆ యాంకర్ ఇంత ప్రొఫెషనల్‌గా ఉందేంటి? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వెనెస్సా వెల్చ్ అనే మహిళ బోస్టన్ 25 న్యూస్ యాంకర్ గా పనిచేస్తోంది. వార్తలు చదువుతున్న సమయంలో ఓ ఈగ ఆమె కనురెప్పలపై పడింది. కొద్దిసేపటి తర్వాత ఆ ఈగ ఆమె నోటిపై పడబోయింది.

అదే సమయంలో వార్తలు చదవడంలో ఏ మాత్రం ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఆ యాంకర్ వెంటనే ఆ ఈగను నోట్లో పెట్టేసుకుంది. ఏ మాత్రం ఇబ్బంది పడకుండా ఆమె చాకచక్యంగా ఈగను మింగిన తీరు అలరిస్తోంది. అక్కడ వార్తలు చదవడం తప్ప ఏమీ జరగలేదన్న విధంగా ఆమె మేనేజ్ చేసింది.

వృత్తి ధర్మాన్ని ఇంత చక్కగా నిర్వర్తిస్తున్న యాంకర్ కు ఎంతగా జీతం పెంచినా తక్కువేనని పలువురు కామెంట్లు చేశారు. ఆమె యాంకరింగ్ చేయడం కోసమే పుట్టినట్లుందంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు. అసలు టీవీ చూసేవారికి ఏ మాత్రం డౌట్ రాకుండా ఆమె ఈగను మింగిందని కొందరు పేర్కొన్నారు.

Also Read: ఈ వీడియోలో ఉన్న వ్యక్తిది ఏం వెర్రో మీరే చెప్పండి: వీసీ సజ్జనార్