ఈ వీడియోలో ఉన్న వ్యక్తిది ఏం వెర్రో మీరే చెప్పండి: వీసీ సజ్జనార్
Viral Video: సజ్జనార్ అడిగిన ప్రశ్నకు నెటిజన్లు ఆసక్తికర సమాధానాలు ఇస్తున్నారు.

నడిరోడ్డుపై కారులో వెళ్తూ ఓ యువకుడు స్టంట్లు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. తలకెక్కిన వెర్రితో ఇటువంటి పనులు చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు.
‘ఎవరి పిచ్చి వారికి ఆనందం. కొందరికి వేపకాయంత వెర్రి ఉంటే.. మరికొందరికి తాటికాయంత ఉంటుంది. ఇంకొందరికి పనసకాయంత ఉంటుంది. ఈ వీడియోలో ఉన్న వ్యక్తిది ఏం వెర్రో మీరే చెప్పండి’ అని సజ్జనార్ పేర్కొన్నారు. ఈ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు. సజ్జనార్ అడిగిన ప్రశ్నకు నెటిజన్లు ఆసక్తికర సమాధానాలు ఇస్తున్నారు.
ఇది మామూలు ఎర్రి కాదు… ఎర్రికే ఎర్రి పుట్టించేంత ఎర్రి……
— A VENKATAREDDY (@AVENKATAREDDY65) May 30, 2024
Viral Video
కాగా, రోడ్డుపై ఇటువంటి స్టంట్ల వల్ల ఇతర వాహనాలకు కూడా ప్రమాదం జరుగుతుందన్న జ్ఞానం కూడా లేకుండా కొందరు యువకులు చేస్తున్న పనులు విస్మయాన్ని కలిగిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన దృశ్యాలను సజ్జనార్ అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నారు.
సీసీటీవీ కెమెరాల్లో రికార్డవుతున్న దృశ్యాలను ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై ఎన్ని చర్యలు తీసుకుంటున్నా చాలా మంది యువకులు తమ తీరు మార్చుకోవడం లేదు.
ఎవరి పిచ్చి వారికి ఆనందం. కొందరికి వేపకాయంత వెర్రి ఉంటే.. మరికొందరికి తాటికాయంత ఉంటుంది. ఇంకొందరికీ పనసకాయంత ఉంటుంది. ఈ వీడియోలో ఉన్న వ్యక్తిది ఏం వెర్రో మీరే చెప్పండి. pic.twitter.com/xHyqZSFqWl
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) May 30, 2024
Also Read: హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై హృదయవిదారక ఘటన