Frontier airlines: విమానంలో ప్రసవించిన మహిళ.. శిశువుకు ఏం పేరు పెట్టారో మీరు ఊహించగలరా?

అమెరికాకు చెందిన ప్రాంటియర్ ఎయిర్ లైన్స్ విమానంలో ఇటీవల ఓ గర్భిణీ పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. విమానం గాల్లో ప్రయాణిస్తున్న క్రమంలోనే ప్రసవం జరిగింది. డెన్వర్ నుంచి ఒర్లాండోకు వెళుతున్న విమానంలో షకేరియా మార్టిన్ అనే గర్భిణీ ప్రయాణించారు. అయితే ఆమె నిండు గర్భిణి. విమానం గాల్లోకి..

Frontier airlines: అమెరికాకు చెందిన ప్రాంటియర్ ఎయిర్ లైన్స్ విమానంలో ఇటీవల ఓ గర్భిణీ పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. విమానం గాల్లో ప్రయాణిస్తున్న క్రమంలోనే ప్రసవం జరిగింది. డెన్వర్ నుంచి ఒర్లాండోకు వెళుతున్న విమానంలో షకేరియా మార్టిన్ అనే గర్భిణీ ప్రయాణించారు. అయితే ఆమె నిండు గర్భిణి. విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. విమాన సిబ్బందిలో ఒకరైన డయానా గిరాల్డో అనే మహిళ షకేరియాను బాత్ రూంలోకి తీసుకెళ్లారు. గర్భవతి అందులోనే ఆడ శిశువుకు జన్మనిచ్చింది.

అయితే తల్లీ బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ విషయాన్నిప్రాంటియర్ ఎయిర్ లైన్స్ ఫేస్ బుక్ లో పోస్టు ద్వారా వెల్లడించింది. అంతేకాక మహిళ సుఖ ప్రసవానికి సహకరించిన డయానా గిరాల్డోను ప్రాంటియర్ ఎయిర్ లైన్స్ సిబ్బంది ప్రశంసించారు. ఎయిర్ లైన్స్ కెప్టెన్ క్రిస్ నై, విమాన సిబ్బంది అందరూ డయానా గిరాల్డోను కొనియాడారు. డయానా మాట్లాడుతూ.. ప్రసవం అనంతరం ఒర్లాండో విమానాశ్రయం సిబ్బందికి ఈ విషయం తెలియజేశామని, ల్యాండ్ కాగానే తల్లీబిడ్డను వైద్యులు పరీక్షించి ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొంది. ఇదిలాఉంటే విమానంలో జన్మించిన ఆ శిశువుకు కుటుంబ సభ్యులు స్కై అనే పేరును పెట్టినట్లు ఎయిర్ లైన్స్ వెల్లడించింది.

Frontier Airlines

ట్రెండింగ్ వార్తలు