China Politics: మిస్టరీగానే విదేశాంగ మంత్రి మిస్సింగ్.. అంతలోనే కొత్త మంత్రిని నియమించిన చైనా

జూన్ 25న సందర్శించిన రష్యన్, శ్రీలంక, వియత్నాం అధికారులతో క్విన్ గ్యాంగ్ సమావేశమయ్యారు. అదే ఆయన బహిరంగంగా కనిపించడం. అయితే క్విన్ గ్యాంగ్‭ను చంపేశారా అనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి

left missing Qin Gang and right new minister Wang Yi

China Politics – Qin Gang: చైనా కొత్త విదేశాంగ మంత్రిగా వాంగ్ యీ నియమితులైనట్లు ఆ దేశ అధికారిక మీడియా మంగళవారం వెల్లడించింది. నెల రోజుల క్రితం తప్పిపోయిన విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ స్థానంలో ఈ నూతన నియామకం చేపట్టారు. “మంగళవారం సమావేశాన్ని ఏర్పాటు చేసి, వాంగ్ యీని విదేశాంగ మంత్రిగా నియమించాలని చైనా అత్యున్నత శాసనసభ నిర్ణయించింది” అని చైనా మీడియా సంస్థ జిన్హువా తెలిపింది. మంత్రి మిస్సింగ్ మిస్టరీగానే ఉంది. అయితే దాని గురించి ఎలాంటి సమాచారం ఇవ్వని ప్రభుత్వం.. కొత్త మంత్రిని మాత్రం నియమించడం గమనార్హం.

Madhya Pradesh : పసిగుడ్డును పొట్టన పెట్టుకున్న పిల్లి.. టెర్రస్‌పై నుంచి కిందకు పడేయడంతో చనిపోయిన చిన్నారి

జూన్ 25న సందర్శించిన రష్యన్, శ్రీలంక, వియత్నాం అధికారులతో క్విన్ గ్యాంగ్ సమావేశమయ్యారు. అదే ఆయన బహిరంగంగా కనిపించడం. అయితే క్విన్ గ్యాంగ్‭ను చంపేశారా అనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. దానికి కారణం, ఫు జావోషియాన్‭ అనే మహిళా జర్నలిస్టుతో ఆయనకు శారీరక సంబంధం ఉండడమేనని అంటున్నారు. ఆయన ఎక్కడున్నారు అనేది మీడియాకు కూడా ఇప్పటి వరకు అంతుపట్టడం లేదు. కావాలనే ఆయనను చైనా ప్రభుత్వం దాచిపెట్టిందా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి.

Rajasthan Politics: ఎర్ర డైరీతో అసెంబ్లీకి వచ్చి గెహ్లాట్ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసిన రాజేంద్ర గూడా.. ఎవరీ రాజేంద్ర గూడా, ఆ డైరీలో ఏముంది?

చైనా అధ్యక్షుడు జిన్‭పింగ్‭కు అత్యంత సన్నిహితుడిగా గ్యాంగ్. కాగా, జిన్‭పింగ్‭తో సమావేశం అయిన తర్వాత నుంచే ఆయన కనిపించకుండా పోయారు. అయితే ప్రభుత్వం దీనిపై ఇప్పటి వరకు ఒక్క ప్రకటన కూడా చేయలేదు. చైనా రాజకీయాల్లో బలమైన నాయకుడిగా ఎదుగుతున్న తరుణంలో ఉన్నట్టుండి కనిపించకుండా పోయారు. కాగా, గ్యాంగ్ గురించి చైనా దేశీయ సెర్చ్ ఇంజన్ బైడూలో నెటిజెన్లు విపరీతంగా వెతుకుతున్నారు. ఇలాంటి శారీరక సంబంధాలను కమ్యూనిస్ట్ దేశాల్లో తీవ్రంగా పరిగణిస్తుంటారు. ఉత్తర కొరియా, రష్యా వంటి దేశాల్లో కూడా ఇలా శారీరక సంబంధాలు ఉన్నవారిని కిడ్నాప్ చేయడం, హతమార్చడం వంటి ఘటనలు జరిగాయి. ఇది కూడా అదేనని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు