Covid 19 : కరోనా కలకలం, పలు నగరాల్లో మళ్లీ లాక్ డౌన్‌లు

పలు దేశాల్లో వైరస్ ప్రకంపనలు సృష్టిస్తోంది. మరణాల సంఖ్య కూడా అధికంగా ఉంటుండడంతో మరోసారి కఠిన ఆంక్షలకు సిద్ధమౌతున్నాయి.

China Covid-19 : కరోనా వైరస్ ఇంకా భయపెడుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. పలు దేశాల్లో వైరస్ ప్రకంపనలు సృష్టిస్తోంది. మరణాల సంఖ్య కూడా అధికంగా ఉంటుండడంతో మరోసారి కఠిన ఆంక్షలకు సిద్ధమౌతున్నాయి పలు దేశాలు. కరోనా పుట్టినల్లుగా పేరొందిన చైనాలో మరోసారి వైరస్ కలకలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసులు రికార్డవుతుండడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అక్కడి ప్రభుత్వం మరోసారి పలు ఆంక్షలు విధించాలని నిర్ణయం తీసుకొంటోంది.

Read More : Telangana : వ్యాక్సిన్‌‌కు పెన్షన్, రేషన్ లింక్..డీహెచ్ వ్యాఖ్యలపై గందరగోళం!

అందులో భాగంగా మళ్లీ లాక్ డౌన్ లు విధిస్తోంది. చైనాలో దాదాపు 11 ప్రావిన్స్ లలో కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. గత వారం రోజుల వ్యవధిలో…11 ప్రావిన్స్ లలో 100కి పైగా కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని బీజింగ్ లో ఇప్పటి వరకు 14 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ వేగంగా విస్తరిస్తుండడంతో…కోవిడ్ నిబంధనలను మరోసారి తెరమీదకు తీసుకొచ్చింది. నిబంధనలు ఉల్లంఘిస్తే..కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.

Read More : Anthrax in Telangana : వరంగల్ జిల్లాలో ఆంత్రాక్స్ కలకలం..వరుసగా చనిపోతున్న గొర్రెలు

చైనా ఉత్తర ప్రాంతంలోని ప్రావిన్స్ లలో అధికంగా కేసులు వెలుగులోకి వస్తుండడంతో…ఆయా ప్రాంతాల్లో ఉన్న పర్యాటక ప్రదేశాలను మూసివేశారు. నగరాల్లోకి వచ్చే వారికి అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. గాన్సు, ఇన్నర్ మంగోలియా, నింగ్ క్సియా, బీజింగ్, గయిజౌతో పాటు పలు ప్రాంతాల్లో కరోనా వైరస్ అధికంగా ఉంది. ఈ ప్రాంతాల్లో ఉన్న పర్యాటక ప్రదేశాలను మూసివేస్తున్నట్లు, ఎవరూ రావొద్దని ప్రభుత్వం సూచించింది.

ట్రెండింగ్ వార్తలు