Diabetes Oral Insulin : మధుమేహానికి ఓరల్ ఇన్సులిన్.. ప్రపంచంలోనే తొలిసారి చైనాలో

రెండు.. మూడు నెలల షుగర్ లెవల్స్ ను సూచించే ఏ1సీ లెవల్స్ ను తగ్గించడంలో ఈ ఇన్సులిన్ సమర్థవంతంగా పని చేసినట్లు క్లినికల్ ట్రయల్స్ లో తేలింది. దీంతో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు దరఖాస్తు చేసుకుంది.

China Oral Insulin : మధుమేహ వ్యాధిగ్రస్తులు ఇప్పటివరకు ఇంజెక్షన్ల ద్వారా ఇన్సులిన్ ను తీసుకోవాల్సి తీసుకుంటున్నారు. ఇకపై మధుమేహానికి ఓరల్ ఇన్సులిన్ అందుబాటులో రానుంది. మధుమేహ వ్యాధిగ్రస్థుల కోసం ప్రపంచంలోనే తొలిసారి నోటి ద్వారా తీసుకునే ఓరల్ ఇన్సులిన్ చైనాలో అందుబాటులోకి రానుంది.

ఓఆర్ఏ-డీ-013-1 అనే ఈ ఇన్సులిన్ ను ఇజ్రాయిల్ కు చెందిన ఒరామెడ్ ఫార్ముస్యూటికల్స్ అనే
సంస్థ అభివృద్ధి చేసింది. చైనాలోని హెఫెయ్ టియాన్ హుయ్ బయోటెక్నాలజీ(హెచ్ టీఐటీ) ఈ ఓవర్ ఇన్సులిన్ ఫేస్-3 ట్రయల్స్ విజయంతంగా పూర్తి చేసింది. రెండు.. మూడు నెలల షుగర్ లెవల్స్ ను సూచించే ఏ1సీ లెవల్స్ ను తగ్గించడంలో ఈ ఇన్సులిన్ సమర్థవంతంగా పని చేసినట్లు క్లినికల్ ట్రయల్స్ లో తేలింది.

Lab Baby : ఇక ల్యాబ్ లోనే శిశువుల తయారీ.. పురుషుడు, మహిళతో పనిలేకుండా

దీంతో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు దరఖాస్తు చేసుకుంది. ఈ సంస్థ నుంచి అనుమతి లభించగానే చైనాలో ఓరల్ ఇన్సులిన్ అందుబాటులోకి తీసుకరానున్నారు. మధుమేహం తీవ్రంగా ఉన్న వారిలో ఇన్సులిన్ ఉత్పత్తి సక్రమంగా జరుగదు.

దీంతో శరీరానికి అవసరమయ్యే ఇన్సులిన్ ను కృత్రిమంగా అందించాల్సివుంటుంది. ఇప్పటివరకు ఇంజెక్షన్ల ద్వారా ఇన్సులిన్ ను తీసుకోవాల్సి వచ్చేది. ప్రతి రోజు ఇంజెక్షన్ వేసుకోవడం మధుమేహ బాధితులకు కొంత అసౌకర్యంగా ఉంటుంది. అయితే ఓరల్ ఇన్సులిన్ ద్వారా ఈ సమస్య ఉండదు.

ట్రెండింగ్ వార్తలు