Covid 19: నిత్యావసరాలు స్టాక్ పెట్టుకోండి.. దేశ ప్రజలను అలర్ట్ చేసిన చైనా ప్రభుత్వం

యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనావైరస్ మహమ్మారి పుట్టినిల్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనాలో మరోసారి వైరస్ విజృంభిస్తోంది. క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. దీంతో చైనా ప్రభుత్వం.. తన

Covid19: యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనావైరస్ మహమ్మారి పుట్టినిల్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనాలో మరోసారి వైరస్ విజృంభిస్తోంది. క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. దీంతో చైనా ప్రభుత్వం.. తన దేశ ప్రజలను అలర్ట్ చేసింది. నిత్యవసరాలను నిల్వ పెట్టుకోవాలని సూచించింది. అంతేకాదు నిత్యావసరాల పంపిణీకి ఏ మాత్రం అవాంతరం కలగకూడదని అధికారులతో చెప్పింది. కేసులు పెరుగుతుండటం వల్ల లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినతరం చేయాలనే అక్కడి ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసిందట.

Diabetes : షుగర్ వ్యాధి గ్రస్తులు తీపిపదార్ధాలు తింటే ప్రమాదమా?..

ఒక్క కరోనా కేసు వచ్చినా చైనా ఉలిక్కిపడుతోంది. కఠిన ఆంక్షలు, లాక్‌డౌన్ వైపు మొగ్గుచూపుతోంది. ఇటీవల కాలంలో ఆ దేశంలో పదుల సంఖ్యలో కేసులు వెలుగుచూస్తుండటంతో.. నిబంధనలను మరింత కఠినతరం చేస్తోంది. కోవిడ్ కేసులను కట్టడి చేసేందుకు సరిహద్దులు మూసివేత, లాక్ డౌన్లు, క్వారంటైన్లను చైనా అమలు చేస్తోంది.

‘రోజువారీ అవసరాలు, అత్యవసర పరిస్థితులకు తగ్గట్టుగా ప్రజలు నిత్యావసర వస్తువులను నిల్వ చేసుకోవాలి’ అని ప్రభుత్వం ప్రజలకు సూచించింది. ఈ ప్రకటనకు అసలు కారణం ఏంటో స్పష్టత లేపోయినా, కరోనా ఆంక్షలు కఠినతరం చేస్తే ప్రజలు ఇబ్బంది ఎదుర్కోకుండా ముందు జాగ్రత్తగా ఈ సూచన చేసిందని కొందరు భావిస్తున్నారు. మరికొందరు ఆహార కొరత గురించి మాట్లాడుతున్నారు. గత రెండేళ్ల కాలంలో సంభవించిన వరదలు పంటలపై తీవ్ర ప్రభావం చూపాయి. దాంతో నిత్యావసరాల ధరలు ఆకాశన్నంటాయి. వేగంగా సంభవిస్తోన్న పర్యావరణ మార్పులు ఈ పరిస్థితిని మరింత దిగజార్చే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.

WhatsApp Cashback: వాట్సాప్‌ పేమెంట్స్‌తో క్యాష్‌బ్యాక్‌.. ఇలా ట్రై చేయండి!

కొవిడ్ విషయంలో జీరో టోలరెన్స్ విధానాన్ని అనుసరిస్తోన్న చైనా.. కేసులు ఏ మాత్రం పెరుగుతున్నాయని అనిపించినా, తక్షణ చర్యలకు ఉపక్రమిస్తోంది. సరిహద్దుల మూసివేత, లాక్‌డౌన్లు, సుదీర్ఘ క్వారంటైన్లు అమలు చేస్తోంది. ఫిబ్రవరిలో వింటర్ ఒలింపిక్స్‌కు ఏమాత్రం ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ఈసారి మరింత కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ దేశంలో సోమవారం 92 మందికి పాజిటివ్‌గా తేలింది. సెప్టెంబర్ నుంచి ఇవే అత్యధిక రోజువారీ కేసులు కావడం గమనార్హం.

ట్రెండింగ్ వార్తలు