Shocking : 24,000 ఏళ్లుగా మంచులోనే బతికే ఉన్న వింత జీవి..!

24,000 ఏళ్లుగా మంచులోనే బతికే ఉన్న వింత జీవిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

Creature Cold grave for nearly 24,000 years without eating or drinking: ఆర్కిటిక్‌ సముద్రంలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు. అప్పుడు వారు షాక్ అయ్యే ఓ వింత జీవి కనిపించింది. శరీరంలో రక్తం కూడా గడ్డకటట్టే చలిలో అక్కడి మంచులో కూరుకుపోయి పడి ఉన్న ఒక వింత జీవిని చూశారు. మరో వింత ఏమిటంటే ఆ వింత జీవి బతికే ఉండటం…! పైగా ఆ వింత జీవి మంచులో ఒకటీ రెండు కాదు వేల ఏళ్లుగా కప్పబడి ఉండటం..ఆ మంచులో తిండి కూడా లేకుండా జీవించి ఉండటం చూసిన శాస్త్రవేత్తలు అత్యంత షాక్ కు గురి అయ్యారు.

Also read : Siberia : మంచులో వింత జీవి..24 వేల ఏళ్లనుంచి ప్రాణంతోనే ఉంది..

ఆ వింత జీవి దాదాపు 24 వేల ఏళ్లుగా ఏమి తినకుండా, నీరు కూడా తాగకుండా మంచులోనే ఉంది. ఇటువంటి వాటిని మైక్రో-జోంబీ జీవులు అంటారని తెలిపారు శాస్త్రవేత్తలు. ఇటువంటి జంతువులు 50 మిలియన్ల ఏళ్ల​ క్రితం వివిధ నీటి ప్రాంతాల్లో ఉండేవని తెలిపారు. ఆ వింతజీవి చర్మంపై అంత్యంత శీతల ప్రాంతంలో కూడా మంచు ప్రభావం ఏ మాత్రం కనిపించలేదని చెప్పారు. వీటిని లేడ్ రోటిఫర్స్ లేదా వీల్ యానిమల్స్ అని కూడా పిలుస్తారని తెలిపారు.

అయితే వీటి చర్మంపై చాలా కణాలతో కూడిన సూక్ష్మ జీవుల ఉంటాయని, పైగా నోటి చుట్టూ దట్టంగా వెంట్రుకలు ఉంటాయని చెప్పారు. గతంలో రష్యన్ శాస్త్రవేత్తలు -20 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 10ఏళ్ల వరకు జీవించగల రోటిఫర్‌లను కనుగొన్నారని కూడా చెప్పారు. ఇవి జన్మనివ్వవని, అలైంగికమైనవని తెలిపారు. శరీరం పొడవుగా ఉంటుందన్నారు.

Also read : పాము కాదు, స్పైడర్ కాదు…మరో వింత జీవి

వాటి పొడవు 0.04 నుంచి 2 మిల్లీమీటర్ల వరకు ఉంటుందని, కానీ చాలా వరకు 0.5 మిల్లీమీటర్లకు మించి పెరగవు అని వెల్లడించారు. పరిమాణంలో చిన్నది అయినప్పటికీ వారి శరీరంలో చాలా క్లిష్టమైన అవయవాలు ఉన్నాయని వాటిని మైక్రోస్కోప్ లేకుండా చూడలేమని చెబుతున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు