China : భారత్ మాపై సైబర్ దాడులు చేస్తోంది!

 భారత్ తమపై సైబర్ దాడులకు పాల్పడుతోందని తాజాగా చైనా ఆరోపించింది. చైనాలోని మిలటరీ సహా పలు ప్రభుత్వ సంస్థలు,ఏరోస్సేస్,విద్యా సంస్థల పై జరుగుతున్న సైబర్ దాడుల వెనుక భారత్

China   భారత్ తమపై సైబర్ దాడులకు పాల్పడుతోందని తాజాగా చైనా ఆరోపించింది. చైనాలోని మిలటరీ సహా పలు ప్రభుత్వ సంస్థలు,ఏరోస్సేస్,విద్యా సంస్థల పై జరుగుతున్న సైబర్ దాడుల వెనుక భారత్ హస్తముందని చైనా అధికారిక మీడియా ‘గ్లోబల్స్ టైమ్స్’ ఒక కథనాన్ని వండి వార్చింది. అంతేకాకుండా పాకిస్తాన్,నేపాల్ ప్రభుత్వరంగ సంస్థలపై కూడా భారత్ ఈ సైబర్ దాడులకు పాల్పడుతుందని చైనాకు చెందిన ప్రముఖ సైబర్ సెక్యూరిటీ కంపెనీ ఎనిటీ కూడా తెలిపిందని ‘గ్లోబల్ టైమ్స్’ ఆ కథనంలో పేర్కొంది.

ప్రభుత్వ,మిలటరీ సిబ్బంది తరహాలో ఫిషింగ్ మెయిల్స్ తో ప్రభుత్వ రంగ సంస్థలపై సైబర్ దాడులకు పాల్పడుతున్నాయని,గతేడాది నవంబర్ లో కూడా చైనా ఔషధ సంస్థలపై కూడా ఇదే తరహా దాడులు జరిగాయని పేర్కొంది. ఈ సైబర్ గ్రూప్ ల వెనుక బలమైన నిఘా వ్యవస్థ అండదండలు ఉన్నాయని పేర్కొంది. అమెరికా-భారత్ మధ్య ఇంటెలిజెన్స్ షేరింగ్ ఉందని కథనంలో తెలిపింది.

2021 తొలి అర్థభాగంలో ఎక్కువగా భారత్ నుంచి ఈ సైబర్ దాడులు జరిగాయని చైనాకు చెందిన 360 సెక్యూరిటీ టెక్నాలజీ పేర్కొన్నట్లు గ్లోబల్ టైమ్స్ తెలిపింది. భారత్ నుంచి సైబర్ దాడులు పెరిగిన నేపథ్యంలో అత్యవసరంగా సైబర్ సెక్యూరిటీ వ్యవస్థను పటిష్ఠం చేసుకోవాల్సిన అవసరం ఉందని 360 సెక్యూరిటీ టెక్నాలజీ నివేదిక పేర్కొన్నట్లు గ్లోబల్ టైమ్స్ తెలిపింది. కాగా,భారత్ వద్ద ఉన్న అధునాతన సైబర్ సమార్థ్యాల గురి్చి ఇతర దక్షిణాసియా దేశాలకు పెద్దగా తెలియకపోవచ్చునని ఆ నివేదిక పేర్కొందని తెలిపింది.

అయితే ప్రపంచంలో ఎక్కడ ఏ సైబర్ దాడి జరిగినా మొదట వినిపించే పేరు చైనాదే. కరోనా సమయంలో కూడా కోవిడ్ వ్యాక్సిన్ పరిశోధనలకు సంబంధించిన సమాచారాన్ని దొంగలించేందుకు చైనా సైబర్ దాడులకు పాల్పడుతున్నట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలొచ్చిన విషయం తెలిసిందే. గతేడాది ముంబై అంధకారానికి కూడా చైనా పనే అని తేలింది. 2020 అక్టోబర్ 13న దేశ ఆర్థిక రాజధాని ముంబైలో విద్యుత్ గ్రిడ్ విఫలమైంది. 2గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లోడ్ డిస్పాచ్ సెంటర్ లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ముంబై నగరంలో బ్లాక్ ఔట్ సంభవించింది. రైళ్లు రద్దయ్యాయి. ముంబై, థానే, నవీ ముంబైలలో ఆఫీసులన్నీ మూతపడ్డాయి. ఆసుపత్రులకు ప్రత్యేక ఎమర్జెన్సీ ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చింది.

ముంబై శివారు ప్రాంతాల్లో ఏకంగా 12గంటల పాటు కరెంట్ పోయింది. విద్యుత్‌ సరఫరా ఆగిపోవడంతో ముంబైలో జనజీవనం స్థంభించిపోయింది. అప్పట్లో అది ఎందుకు జరిగింది అనేది తెలియనప్పటికి, దాని వెనుక చైనా హ్యాకర్లు ఉన్నారని ఆలస్యంగా బయటపడింది. అలాంటి చైనా ఇప్పుడు..భారత్ తమపై సైబర్ దాడులకు పాల్పడుతోందంటూ కొత్త రాగం అందుకుంది.

ALSO READ Firecrackers Blast : బాబోయ్… బైక్‌పై వెళ్తుండగా బాంబుల్లా పేలిన టపాసులు.. తండ్రి, ఏడేళ్ల కొడుకు మృతి

ట్రెండింగ్ వార్తలు