International Democracy : ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని భ్రష్ఠు పట్టిస్తున్నాయి..64 శాతం దేశాల్లో ఇదే పరిస్థితి

ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం క్షీణించిపోతోందని.. ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని భ్రష్ఠు పట్టిస్తున్నాయి..64 శాతం దేశాల్లో ఇదే పరిస్థితి ఉందని ఓ నివేదికలో వెల్లడైంది.

Democracy is deteriorating across the world : ప్రజాస్వామ్యం అనే మాటకు అర్థం లేదా? ప్రజాపాలన అనే పేరుతో ప్రభుత్వాలు నియంతృత్వ ధోరణులకు పాల్పడుతున్నాయా? ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోవట్లేదా? అంటే నిజమేనంటోంది..‘ఇంటర్నేషనల్‌ ఐడియా’ అనే అంతర్‌ ప్రభుత్వ సంస్థ. పంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం క్షీణించిపోతోందని..ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని భ్రష్ఠు పట్టిస్తున్నాయని ‘ఇంటర్నేషనల్‌ ఐడియా’ అనే అంతర్‌ ప్రభుత్వ సంస్థ సోమవారం (నవంబర్ 22,2021) తన తాజా నివేదికలో వెల్లడించింది. కరోనాను అరికట్టాలనే పేరుతో ఆగస్ట్ 2021 నాటికి..ప్రపంచ వ్యాప్తంగా 64 శాతం దేశాలు “అసమానమైన, అనవసరమైన లేదా చట్టవిరుద్ధం” చర్యలు తీసుకున్నాయని 34-దేశాల సంస్థ పేర్కొంది.

Read more : Corona Cases : దేశంలో ఏడాదిన్నర కనిష్టానికి కరోనా కేసులు

కరోనా మహమ్మారి కట్టడి పేరుతో పలు దేశాలు అప్రజాస్వామిక, అనవసర చర్యలు తీసుకున్నాయని నివేదికలో వెల్లడించింది. చాలా ప్రజాస్వామికంగా వ్యవహరించాయని తెలిపింది. ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని భ్రష్ఠు పట్టిస్తున్నాయని వ్యాఖ్యానించింది. ఈ దేశాల్లో ప్రపంచంలోనే ప్రజాస్వామిక దేశంగా పేరొందిన భారత్ కూడా ఉండటం గమనించాల్సిన విషయం. భారత్‌లో కూడా ప్రజాస్వామ్యం కొరవడిందని పేర్కొంది. ప్రజలకు వాక్ స్వతంత్ర్యం కూడా కొరవడిందని తెలిపింది.

Read more : Weather Update: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..తమిళనాడుపై విరుచుకుపడనుందా?

ఐ-ఐడియా (ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెమోక్రసీ, ఎలక్టోరల్‌ అసిస్టెన్స్‌) స్వీడన్‌ కేంద్రంగా పనిచేసే సంస్థ. కరోనా నియంత్రణ పేరిట 64 శాతం దేశాలు ‘అసమంజస, అనవసర, అక్రమ చర్యలు చేపట్టాయని ఆ సంస్థ పేర్కొంది. గత దశాబ్దకాలంలో ప్రజాస్వామ్యం విషయంలో వెనుకడుగు వేసిన దేశాల సంఖ్య రెట్టింపు అయిందని తెలిపింది. మొత్తంగా చూస్తే 2020లో నిరంకుశాధికారిత దిశగా వెళుతున్న దేశాలు ప్రజాస్వామిక దేశాల కంటే ఎక్కువయ్యాయని విశ్లేషించింది.

Read more : Yamuna Expressway : యమునా ఎక్స్‌ప్రెస్ వేకి అటల్ బిహారీ వాజ్‌పేయి పేరు..

ఈ విషయంలో అమెరికా, హంగేరి, పోలాండ్‌, స్లొవేనియా దేశాలను ప్రత్యేకంగా ప్రస్తావించింది. గత రెండేండ్లలో ఎన్నికల్లో అక్రమాలు, సైనిక కుట్రల వల్ల ప్రపంచం నాలుగు ప్రజాసామ్య దేశాలను కోల్పోయిందని వివరించింది.ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఉన్న ఇంటర్‌గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ 80 పేజీల నివేదికలో “పౌర క్రియాశీలత అద్భుతమైన బలం” అని సూచించింది.

ట్రెండింగ్ వార్తలు