Elon Musk: ఎలన్ మస్క్‌పై ఆరోపణలు కప్పిపుచ్చుకునేందుకు రూ.194కోట్లు నిజమేనా..

ఏదో ఒక టాపిక్ తో ఎప్పుడూ వార్తల్లో ఉండే టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్పేస్‌ఎక్స్‌ సంస్థలో పని చేసిన ఓ మహిళా ఉద్యోగిని నుంచి వినిపిస్తుండటం గమనార్హం.

 

Elon Musk: ఏదో ఒక టాపిక్ తో ఎప్పుడూ వార్తల్లో ఉండే టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్పేస్‌ఎక్స్‌ సంస్థలో పని చేసిన ఓ మహిళా ఉద్యోగిని నుంచి వినిపిస్తుండటం గమనార్హం. 2016 నుంచి వెంటాడుతున్న ఈ ఆరోపణలను భారీ మొత్తంలో ముట్టజెప్పి నోరు మూయించారంటూ ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

స్పేస్ఎక్స్ కార్పొరేట్ జెట్ విభాగంలో ఫ్లైట్ అటెండెంట్‌గా పని చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగినిని లైంగిక వేధింపులకు గురి చేశారంటూ.. బాధిత మహిళ కేసు నమోదు చేయడంతో చాలా దూరం వెళ్లిందంటూ వార్తలొచ్చాయి. ఈ విషయాన్ని మూడోకంటికి తెలియకుండా ఎలాన్ మస్క్- సెటిల్ చేసుకున్నాడంటూ తాజాగా అమెరికన్ మీడియా వెల్లడించింది.

2018లో ఎలాన్ మస్క్ ఓ ఫ్లైట్ అటెండెంట్‌కు 2లక్షల 50వేల డాలర్లను చెల్లించినట్లు పేర్కొంది. దీనిపై స్పేస్‌ఎక్స్ యాజమాన్యాన్ని వివరణ కోసం ప్రయత్నించగా.. ఇప్పటివరకు స్పందించలేదని అమెరికన్ మీడియా తెలిపింది. ఎలన్ మస్క్‌కు అందుబాటులోకి రాలేదని, అతని పర్సనల్ వ్యవహారాలనను చూసుకునే మేనేజర్ అలెక్స్ స్పైరో కూడా దీనిపై రెస్పాండ్ అవలేదని పేర్కొంది.

Read Also : ట్విట్టర్ డీల్ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ఎలాన్ మస్క్

ప్రైవేట్ జెట్‌లో ప్రయాణిస్తోన్న సమయంలో ఎలాన్ మస్క్- ఫ్లైట్ అటెండెంట్‌ను లొంగదీసుకునేందుకు ప్రయత్నించారు. విమానంలోనే ఉన్న తన ప్రత్యేక గదిలో గడపాలంటూ ఒత్తిడి తెచ్చారని, బాధితురాలి స్నేహితుడి సమాచారం ఆధారంగా ఈ కథనాన్ని ప్రచురించింది యూఎస్ మీడియా. ఆ తర్వాత కొన్ని అభ్యంతరకర మెసేజీలను ఆమెకు పంపేవాడని తెలిపింది.

ఈ విషయం వెలుగులోకి రావడంతో 2018లో రెండున్నర లక్షల డాలర్లను చెల్లించి ఈ వ్యవహారాన్ని ఎలన్ మస్క్ కంపెనీ సెటిల్ చేసుకున్నట్లు పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు