Type-C Cable: చార్జింగ్ కేబుల్ కష్టాలకు చెల్లు.. ఇకపై అన్ని గాడ్జెట్లకు ఒకటే కేబుల్.. చట్టం చేసిన యురోపియన్ యూనియన్

చార్జింగ్ కేబుల్ కష్టాలకు చెల్లుచీటీ పాడేలా కొత్త చట్టం తీసుకొచ్చింది యురోపియన్ యూనియన్. ఇకపై ఈయూ పరిధిలో విక్రయించే ప్రతి గ్యాడ్జెట్‌ను టైప్-సి కేబుల్‪‌కు అనుగుణంగానే తయారు చేయాలి. దీనివల్ల ఒకే కేబుల్‌ను అన్ని డివైజ్‌లకు వాడుకోవచ్చు.

Type-C Cable: స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్ వాచెస్ వంటి విషయంలో చాలా మందికి ఎదురయ్యేది చార్జింగ్ సమస్య. ఇంటి నుంచి ఆఫీసుకు లేదా వేరే ఊళ్లకు వెళ్లినప్పుడు సొంత చార్జర్ తీసుకెళ్తేనే సరి. లేదంటే చార్జింగ్ పెట్టుకోవడం కొన్నిసార్లు కుదరదు. ఎందుకంటే తమ దగ్గరున్న గాడ్జెట్‌కు సరిపోయే కేబుల్ వేరేవాళ్ల దగ్గర దొరక్కపోవడమే.

Bapatla: బాపట్లలో విషాదం.. సముద్రంలో విద్యార్థులు గల్లంతు

కొందరి దగ్గర నార్మల్ కేబుల్ చార్జర్ ఉంటే.. ఇంకొందరి దగ్గర టైప్-సి కేబుల్ ఉంటుంది. దీంతో ఒక డివైజ్‌పై పని చేసే కేబుల్ మరో డివైజ్‌కు పనిచేయదు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు సిద్ధమైంది యురోపియన్ యూనియన్ (ఈయూ). తమ యూనియన్‌ పరిధిలో విక్రయించే అన్ని డివైజ్‌లకు టైప్-సి కేబుల్ మాత్రమే వాడేలా చట్టం చేసింది. 2024 చివరికల్లా యురోపియన్ యూనియన్ పరిధిలో విక్రయించే ప్రతి డివైజ్.. టైప్-సి చార్జర్‌తోనే పని చేయాలి. స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్ వాచెస్, డిజిటల్ కెమెరాలు వంటి చిన్న గాడ్జెట్స్ అన్నింటికీ ఇదే కేబుల్ వాడాలి. చివరికి కొత్తగా వచ్చిన ఐఫోన్లకు కూడా ఈ కేబులే ఉండాలి. 2026 కల్లా ల్యాప్‌టాప్‌తోపాటు అన్ని డివైజ్‌లు, గ్యాడ్జెట్లకు కూడా టైప్-సి కేబుల్ ఉండాల్సిందే.

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో హిమపాతం.. మంచు పర్వతాల్లో చిక్కుకుని 10 మంది మృతి

ఇది అనేక కంపెనీలకు ముఖ్యంగా.. యాపిల్ సంస్థకు పెద్ద దెబ్బే. ఎదుకంటే ఈ సంస్థ ప్రత్యేకంగా లైట్నింగ్ పోర్టుల్ని మాత్రమే చార్జింగ్ కోసం తయారు చేస్తుంది. కానీ, ఇకపై ఇలా కుదరదు. యాపిల్ కూడా తమ ఫోన్లు, ట్యాబ్లెట్లుసహా అన్ని గ్యాడ్జెట్లను టైప్-సి కేబుల్‌కు అనుగుణంగానే తయారు చేయాలి. ఈయూలో అమ్ముడవుతున్న గ్యాడ్జెట్లలో 20 శాతం యాపిల్ ఉత్పత్తులే. ఇక ఈ నిర్ణయం వల్ల వినియోగదారులకు చాలా మేలు జరుగుతుంది. అన్నింటికీ ఒకే కేబుల్‌తో చార్జింగ్ చేసుకోవచ్చు. ఒక గ్యాడ్జెట్ కేబుల్ పాడైతే, మరో కేబుల్ కొనాల్సిన అవసరం ఉండదు. వేరే గ్యాడ్జెట్ కేబుల్ వాడుకోవచ్చు.

Nobel Prize: ముగ్గురు శాస్త్రవేత్తలకు భౌతిక శాస్త్రంలో నోబెల్

మరోవైపు యాపిల్ సంస్థ ఒరిజినల్ కేబుల్ ఇవ్వకుండా, వేరేగా కొనుక్కునేలా చేస్తున్నాయి. దీనివల్ల కూడా వినియోగదారులపై అధిక భారం పడుతోంది. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయంతో వినియోగదారులకు మేలు జరుగుతుంది. ఇదే తరహా చట్టం మన దేశంలోనూ తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. త్వరలో మన దేశంలో కూడా ఈ తరహా చట్టం అమలుకానుంది.

 

ట్రెండింగ్ వార్తలు