Cm Revanth Reddy : మినిమం 9, మ్యాగ్జిమం 13..! కాంగ్రెస్ ఎన్ని గెలుస్తుందో చెప్పేసిన సీఎం రేవంత్

రాష్ట్రంలో ఎన్నికలు, రాజకీయాలు ముగిసిపోయాయన్నారు. ఇప్పటి నుంచి సంక్షేమంపైనే నా దృష్టి అంతా అని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు.

Cm Revanth Reddy : పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మినిమం 9.. మ్యాగ్జిమం 13 సీట్లు గెలుస్తుంది అంటూ సీఎం రేవంత్ రెడ్డి అంచనా వేశారు. ఎవరి ఓట్లు వారికి పడితే ఎన్నికలు అంచనా వేయొచ్చు అన్నారాయన. కంటోన్మెంట్ లో కాంగ్రెస్ 20వేల మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు సీఎం రేవంత్. బీజేపీకి దేశంలో మొత్తం సీట్లు 210 కూడా దాటవన్నారు. రేపటి నుంచి పూర్తిగా పాలనపై ఫోకస్ చేస్తానన్నారు ముఖ్యమంత్రి రేవంత్. ధాన్యం కొనుగోలు, రుణమాఫీపై దృష్టి పెడతామన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు, రాజకీయాలు ముగిసిపోయాయన్నారు. ఇప్పటి నుంచి సంక్షేమంపైనే నా దృష్టి అంతా అని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు.

”పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు తక్కువలో తక్కువ 9 సీట్లు వస్తాయి. మంచి రిజల్ట్ అయితే 13 సీట్లు వస్తాయి. బీఆర్ఎస్ ఎలక్షన్ ఎలా చేసిందనే దానిని బట్టి రిజల్ట్ ఉంటుంది. ఎవరి ఓట్లు వాళ్లు తీసుకుంటే.. ఎలక్షన్ అంచనా వేయవచ్చు. కంటోన్మెంట్ లో కాంగ్రెస్ 20 వేల మెజారిటీతో గెలుస్తుంది. దేశంలో బీజేపీకి మొత్తం 210 సీట్లు దాటేలా లేదు. రేపటి నుంచి పరిపాలనపై పూర్తిగా దృష్టి పెడతాం. ధాన్యం కొనుగోలు.. రుణమాఫీపై ఫోకస్ పెడతాం. స్కూల్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి.. వాటిపై దృష్టి పెడతాం. రాష్ట్రంలో ఎన్నికలు, రాజకీయాలు ముగిశాయి. రేపటి నుండి పరిపాలన, సంక్షేమంపైనే ఇక నా దృష్టి. రైతులు, విద్యార్థులు, తాగు సాగు నీరు.. వీటిపైనే దృష్టి. రైతురుణ మాఫీపై మాట నిలబెట్టుకుంటాం. ఎస్ ఎల్ బీసీ మీటింగ్ పెట్టి.. రైతుల రుణంకు సర్కార్ గ్యారంటీ ఇస్తుంది. రైతులను ఒకేసారి రుణ విముక్తులను చేస్తాం. రుణమాఫీ కోసం.. Frbm పరిధిలో లోన్ తీసుకుంటా.

ఇక రాజకీయం ముగిసింది. నా దృష్టి పూర్తిగా పరిపాలనపై పెడతా. విమర్శకులు ఏం అనుకున్నా పట్టించుకోను. రైతుబంధు కూడా పూర్తి చేయరు అన్నారు. చేశాక అది మా క్రెడిట్ అంటున్నారు. రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా.. ఆ క్రెడిట్ వారే తీసుకోమనండి.

ఓటింగ్ సరళిని పరిశీలించాం.. 13 సీట్లు గెలుస్తాం. ధరణిపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకుని.. నిర్ణయం ఉంటుంది. అఖిలపక్షం పెడతాం. రైతుల సమస్యలపై చర్చిస్తాం. రేషన్ షాప్ లో సన్న బియ్యంతో పాటు మిగతా సరుకులు ఇస్తాం. అసెంబ్లీలో చర్చ చేసి ఏదైనా నిర్ణయం తీసుకుంటాం. లేదంటే అఖిలపక్షం పెడతాం. రేషన్ షాపుల్లో నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసి పంచుతాం. సామాన్యులు కొనుగోలు చేసే 9 వస్తువులు రైతుల నుంచి కొనుగోలు చేసి ఇస్తాం. రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇస్తాం. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి.. ప్రజలకు ఇస్తాం. స్టేట్ కు ఏం కావాలో వాటిని లిస్ట్ చేసుకొని.. రైతుల నుంచి వచ్చేలా చూస్తా. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే యూనివర్సిటీలకు కొత్త వీసీలను నియమిస్తాం.

మిల్లర్స్ అక్రమాలు చేస్తామంటే.. తాట తీస్తాం. మేము చెప్పిన పంటలకు మద్దతు ధర ఇస్తాం. గ్రాడ్యువేట్ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న మా పార్టీ అభ్యర్థి. గెలిపిస్తాం. కొత్తగా రేషన్ కార్డులు ఇస్తాం. ఇది నిరంతరం జరుగుతుంది. ఆరోగ్యశ్రీ కార్డుకు.. రేషన్ కార్డ్ కు సంబంధం ఉండదు. కార్పొరేట్ విద్యలో ఫీజుల నియంత్రణపై దృష్టి పెడతాం. అన్ని యూవర్శిటీలకు వైస్ ఛాన్సలర్ వేస్తాం. కరెంట్ విషయంలో కావాలనే కొందరు అధికారులు తప్పుడు విధానాలు చేస్తున్నారు. హరీశ్ రావు ఒక మెకానిజం ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని చూశారు. కొన్ని గుర్తించాం. కేసులు కూడా నమోదయ్యాయి. విద్య, వైద్యం, వ్యవసాయంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

”కర్ణాటక నుండి నీళ్లు అడిగి తీసుకున్నాం. ఫోన్ ట్యాపింగ్ లో ఏం జరిగిందో అసెంబ్లీలో చెబుతాం. రాధాకృష్ణ ఎవరో నాకు తెలీదు. రేపటి నుండి సచివాలయంకు వెళతా.. సమీక్షలు చేస్తా. తడిసిన ధాన్యంపై సమీక్షించి రైతులకు అండగా ఉంటాం. ఆకస్మిక తనిఖీలు, ఆకస్మిక పర్యటనలు ఉంటాయి. పదేళ్లు ఇక్కడే ఉంటా. ప్రజలకు వంద ఏళ్లకు సరిపడ ప్రణాళికతో ముందుకెళతా. మూసీ కారిడార్ ను ఆదాయ వనరుగా మార్చుతా. RRR తెలంగాణ అభివృద్ధి విస్తరణకు అడ్రస్ గా మారుతుంది. హైదరాబాద్ యూటీ కాదు. అది స్టాప్ గ్యాప్ మాత్రమే. ఎలక్టోరల్ వరకు మాత్రమే యూటీ ఉంటుంది. యూటీపై మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు. ఆర్ఆర్ఆర్ తో గ్రోత్ కారిడార్లను అనుసంధానం చేస్తాం. వరంగల్ ను హైదరాబాద్ కు ధీటుగా అభివృద్ధి చేస్తాం” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read : ఏపీలో గెలిచేది ఎవరు? ఎన్నికల ఫలితాలపై భారీగా బెట్టింగ్‌లు, చేతులు మారుతున్న కోట్ల రూపాయలు

 

ట్రెండింగ్ వార్తలు