ఏపీలో గెలిచేది ఎవరు? ఎన్నికల ఫలితాలపై భారీగా బెట్టింగ్‌లు, చేతులు మారుతున్న కోట్ల రూపాయలు

తమ నాయకుడే గెలుపొందుతారని ఒకరు, తమ పార్టీనే అధికారంలోకి వస్తుందని మరొకరు, ఊహించని విధంగా ఫలితాలు ఉంటాయని మరొకరు పెద్ద ఎత్తున బెట్టింగ్ లకు సిద్ధం అవుతున్నారు.

ఏపీలో గెలిచేది ఎవరు? ఎన్నికల ఫలితాలపై భారీగా బెట్టింగ్‌లు, చేతులు మారుతున్న కోట్ల రూపాయలు

Bettings On Ap Election Results : ఏపీలో పోలింగ్ అలా ముగిసిందో లేదో అప్పుడే జోరుగా బెట్టింగ్ లు ప్రారంభం అయ్యాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? మెజార్టీ ఎంత రానుంది? ప్రముఖులు బరిలో నిలిచిన చోట ఎవరు విజయం సాధిస్తారు? అన్న అంశాలపై కోట్లలో బెట్టింగ్ జరుగుతోంది. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాలపై ప్రధానంగా ఫోకస్ చేసిన బెట్టింగ్ రాయుళ్లు.. కోట్ల రూపాయల బెట్టింగ్ లు వేస్తున్నారు. తమ నాయకుడే గెలుపొందుతారని ఒకరు, తమ పార్టీనే అధికారంలోకి వస్తుందని మరొకరు, ఊహించని విధంగా ఫలితాలు ఉంటాయని మరొకరు పెద్ద ఎత్తున బెట్టింగ్ లకు సిద్ధం అవుతున్నారు. ఇంకా ఫలితాలు రాకముందే.. కోట్ల రూపాయలు చేతులు మారిపోతున్నాయి.

గోదావరి జిల్లాల్లో చిత్రవిచిత్ర పద్ధతుల్లో బెట్టింగ్ లు జరుగుతున్నాయి. ఉండి, దెందులూరు, భీమవరం, నర్సాపురం పార్లమెంట్, ఏలూరు పార్లమెంట్ స్థానాల ఫలితాలపై భారీగా బెట్టింగ్ లు జరుగుతున్నాయి. అటు గోదావరి జిల్లాలలో పార్టీలు సాధించే స్థానాలపైన, పిఠాపురం నియోజకవర్గంలో మెజార్టీపైన భారీగా బెట్టింగ్ లు జరుగుతున్నాయి. గెలిచే పార్టీ ఎవరనే దానిపైన, నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు, మెజార్టీలపైన బెట్టింగ్ లు సాగుతున్నాయి. కొన్నిచోట్ల డబ్బుకు బదులు భూములు, వాహనాలను బెట్టింగ్ లో పెడుతున్నారు.

అటు ఉమ్మడి అనంతపురం జిల్లాలోనూ భారీగా బెట్టింగ్ లు సాగుతున్నాయి. పోలింగ్ ముగియడంతో తీవ్ర స్థాయిలో బెట్టింగ్ లు జరుగుతున్నాయి. తాడిపత్రి, రాప్తాడు, ధర్మవరం, అనంతపురం అర్బన్, హిందూపురం నియోజకవర్గాలపై భారీగా బెట్టింగ్ లు సాగుతున్నాయి. ప్రకాశం జిల్లాలోనూ ఇదే తరహా బెట్టింగ్ లు జరుగుతున్నాయి. జిల్లాలోని మెజార్టీ నియోజకవర్గాల్లో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. పోలింగ్ ముగియక ముందు నుంచే బెట్టింగ్ లు మొదలయ్యాయి. సామాన్య ప్రజలు కూడా బెట్టింగుల్లో భాగమవుతున్నారు. బెట్టింగ్ లపై జిల్లా వ్యాప్తంగా ఆందోళన నెలకొంది.

ఇక కొన్ని ఏరియాలో ఎవరికి ఎన్ని ఓట్లు పోలవుతాయి? మొత్తం ఓట్లలో ఎంత పర్సంటేజ్ పోలింగ్ నమోదవుతుంది? అనే విషయాలపైనా పందాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు, ఓట్ల లెక్కింపునకు మధ్య దాదాపు 20 రోజుల గ్యాప్ ఉంది. దీంతో బెట్టింగ్ రాయుళ్లు మధ్యవర్తులను ఆశ్రయిస్తున్నారు. 100 రూపాయల బాండ్ పేపర్లపై సంతకాలు చేసి గెలిచిన వారికి నగదు ఇచ్చేలా అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. మధ్యవర్తిత్వం వహించిన వారికి 2.5శాతం కమీషన్ ఇచ్చేలా కండీషన్లు పెడుతున్నారు. కొన్ని చోట్ల ఆన్ లైన్ లో మనీ ట్రాన్షాక్షన్స్ జరుగుతున్నాయి.

Also Read : ప్రజలు జగన్‌ను మరోసారి దీవిస్తారు, అందుకు ఇదే నిదర్శనం- కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు