Attack On Pulivarthi Nani : టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై దాడి.. తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత

ఈ ఘటనలో నానిని కాపాడేందుకు ప్రయత్నించిన గన్ మెన్ పైన ఒక్కసారిగా వేటు వేశారు. గన్ మెన్ కు కంటి దగ్గర తీవ్ర గాయమైంది.

Attack On Pulivarthi Nani : తిరుపతి జిల్లా చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగింది. నగరంలోని పద్మావతి మహిళా యూనివర్సిటీ ఆవరణలో ఈ ఘటన చోటు చేసుకుంది. యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములను పరిశీలించేందుకు వెళ్లిన నాని వాహనంపై వైసీపీ కార్యకర్తలు రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో నాని గన్ మెన్ గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి.

పద్మావతి మహిళా యూనివర్సిటీ ఆవరణలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చంద్రగిరి సెగ్మెంట్ కు సంబంధించిన ఈవీఎంలను వర్సిటీలో భద్రపరిచారు. వాటిని పరిశీలించేందుకు మధ్యాహ్నం సమయంలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని తన అనుచరులతో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇదే సమయంలో అక్కడే ఉన్న వైసీపీ నేత భాను, అతడి అనుచరులు అంతా కలిసి ఒక్కసారిగా పులివర్తి నాని వాహనంపై దాడి చేశారు.

ఇందుకు సంబంధించిన కీలకమైన సీసీటీవీ ఫుటేజీ కూడా వెలుగులోకి వచ్చింది. రెడ్ కలర్ వాహనంలో వచ్చిన వ్యక్తులు ఒక్కసారిగా పులివర్తి నాని వాహనంపై దాడికి పాల్పడ్డారు. కారులోంచి గొడ్డళ్లు రాళ్లు తీసి విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో నానిని కాపాడేందుకు ప్రయత్నించిన గన్ మెన్ పైన ఒక్కసారిగా గొడ్డలి వేటు వేశారు. గన్ మెన్ కు కంటి దగ్గర తీవ్ర గాయమైంది. విధి లేని పరిస్థితుల్లో గన్ మెన్ రెండు రౌండ్లు గాల్లోలోకి కాల్పులు జరిపారు. దాదాపు 15 నిమిషాల పాటు ఓ ఫ్యాక్షన్ సినిమా ఫక్కీలో పులివర్తి నాని వాహనంపై దాడి జరిగింది.

Also Read : ఏపీలో గెలిచేది ఎవరు? ఎన్నికల ఫలితాలపై భారీగా బెట్టింగ్‌లు, చేతులు మారుతున్న కోట్ల రూపాయలు

 

ట్రెండింగ్ వార్తలు