Mike Pence :అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ సంచలన నిర్ణయం

అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ ఆదివారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను అమెరికా అధ్యక్ష రేసు నుంచి వైదొలగుతున్నట్లు మైక్ పెన్స్ ప్రకటించారు. ఆర్థిక సవాళ్లు, పోల్ సంఖ్యలో వెనుకబడి ఉన్న నేపథ్యంలో అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ తన అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించారు....

Former US Vice President Mike Pence

Mike Pence : అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ ఆదివారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను అమెరికా అధ్యక్ష రేసు నుంచి వైదొలగుతున్నట్లు మైక్ పెన్స్ ప్రకటించారు. ఆర్థిక సవాళ్లు, పోల్ సంఖ్యలో వెనుకబడి ఉన్న నేపథ్యంలో అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ తన అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించారు.

Also Read :  Fire Accident : బొగ్గు గనిలో ఘోర అగ్నిప్రమాదం.. 32 మంది దుర్మరణం

తాను రిపబ్లికన్ నాయకులను ఎన్నుకోవడంలో సహాయం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. లాస్ వెగాస్‌లో జరిగిన రిపబ్లికన్ యూదు కూటమి వార్షిక సదస్సులో పెన్స్ ఈ వ్యాఖ్యలు చేశారు. చర్చల తర్వాత తాను అధ్యక్ష ప్రచారాన్ని నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు మైక్ పెన్స్ చెప్పారు.

Also Read :  NED vs BAN : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో నెద‌ర్లాండ్స్ మ‌రో సంచ‌లనం.. బంగ్లాదేశ్ పై ఘ‌న విజ‌యం

పెన్స్ 2024 రిపబ్లికన్ ప్రెసిడెంట్ నామినేషన్ కోసం పోటీ చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కావడానికి ముందు అతను ఇండియానా గవర్నర్‌గా, యుఎస్ కాంగ్రెస్‌మెన్‌గా పనిచేశారు. ఇతను గతంలో ట్రంప్ హయాంలో యూఎస్ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.

ట్రెండింగ్ వార్తలు