India Boycott : బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకులను బహిష్కరించిన భారత్

అయితే రెండేళ్ల క్రితం గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో గాయపడ్డ రెజిమెంట్ కమాండర్ టార్చ్ బేరర్ గా రన్ లో పాల్గొనేందుకు చైనా ఛాన్స్ ఇచ్చింది.

Beijing Winter Olympics : బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకులను భారత్ బహిష్కరించింది. వింటర్ ఒలింపిక్స్ ప్రారంభబోత్సవానికి భారత రాయబారి హాజురు కావడం లేదని వెల్లడించింది. గాల్వాన్ సైనికుడుని చైనా టార్చ్ బేరర్ గా పేర్కొనడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా వింటర్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తోపాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అయిదుగురు సెంట్రల్ ఏషియా అధ్యక్షులు, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హాజరుకానున్నారు. రేపటి నుంచి బీజింగ్ లో వింటర్ ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ బీజింగ్ నగరంలో టార్చ్ రిలే జరిగింది.

అయితే రెండేళ్ల క్రితం గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో గాయపడ్డ రెజిమెంట్ కమాండర్ టార్చ్ బేరర్ గా రన్ లో పాల్గొనేందుకు చైనా ఛాన్స్ ఇచ్చింది. నిన్న జరిగిన ఒలింపిక్ టార్చ్ ర్యాలీలో సుమారు 12వందల మంది టార్చ్ బేరర్లు పాల్గొన్నారు. దాంట్లో 2020, జూన్ 15న గాల్వాన్ లో జరిగిన ఘర్షణలో గాయపడ్డ రెజిమెంట్ కమాండర్ క్యూ ఫాబావో ఉన్నట్లు చైనా గ్లోబల్ టైమ్స్ పత్రిక పేర్కొంది. గాల్వన్ దాడిలో ఫాబావో తలకు గాయాం అయింది. స్కేటింగ్ చాంపియన్ వాంగ్ మెంగ్ నుంచి అతను టార్చ్ ను అందుకున్నట్లు చెప్పారు. గాల్వాన్ దాడిలో చనిపోయినట్లు నలుగురు సైనికులను గతంలో చైనా సన్మానించింది.

Stock Markets : నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 20వ తేదీ వరకు బీజింగ్ లో వింటర్ ఒలింపిక్స్ జరుగనున్నాయి. ఇందులో సుమారు 3 వేల మంది అథ్లెట్లు 109 వేర్వేరు విభాగాల్లో పోటీ పడనున్నారు. మార్చి4వ తేదీ నుంచి 13 వరకు వింటర్ పారాలింపిక్స్ జరుగనున్నాయి.ఇందులో ఉండే 78 విభాగాల్లో మొత్తం 736 మంది పాల్గొంటారు. కర్లింగ్ లాంటి కొన్ని ఈవెంట్లు ప్రారంభ కార్యక్రమానికి ముందే ఫిబ్రవరి 4 తేదీన ప్రారంభమవుతాయి. ఈ క్రీడల కోసం చైనా ప్రభుత్వం, వ్యాపార సంస్థలు 3.9 బిలియన్ డాలర్లను ఖర్చు పెడుతున్నాయి. ఈ క్రీడలు బీజింగ్ తో పాటు, పరిసర ప్రాంతాల్లోనూ జరుగనున్నాయి. ఇండోర్ బస్ క్రీడలు బీజింగ్ లోని స్టేడియంలో జరుగుతాయి.

బీజింగ్ లో జరిగే ఒలింపిక్స్ ను పలు దేశాలు బహిష్కరించాయి. అమెరికా, యూకే, కెనడా దౌత్యపరమైన బహిష్కరణను ప్రకటించాయి. ఆస్ట్రేలియా, లిథుమేనియా, కొసోవో కూడా ఇదే కోవలోకి చేరాయి. అయితే ఈ దేశాల నుంచి క్రీడల్లో పాల్గొనేందుకు క్రీడాకారులను పంపినప్పటికీ, మంత్రులు, ఇతర అధికారులు మాత్రం హాజరుకావడం లేదు. బీజింగ్ లో జరుగనున్న వింటర్ ఒలింపిక్స్, పారలింపిక్స్ ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు చాలా దేశాలు దౌత్యపరమైన నిషేధాలను విధించాయి. చైనాకు ఉన్న మానవ హక్కుల ఉల్లంఘన రికార్డుల వల్ల పలు దేశాలు తమ దేశ అత్యున్నత అధికారులను ఒలింపిక్స్ కు పంపకూడదని నిర్ణయించాయి.

ట్రెండింగ్ వార్తలు