Indian consulate in San Francisco : శాన్ ఫ్రాన్సిస్కో భారత కాన్సులేట్‌పై ఖలిస్థాన్ మద్ధతుదారుల దాడి

శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌ కార్యాలయంపై ఖలిస్థాన్ మద్ధతుదారులు మరోసారి దాడి చేశారు. రాత్రివేళ వచ్చిన ఖలిస్థాన్ మద్ధతుదారులు భారత కాన్సులేట్‌ కార్యాలయంపై దాడి చేసి నిప్పుపెట్టారు....

Indian consulate in San Francisco

Indian consulate in San Francisco : శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌ కార్యాలయంపై ఖలిస్థాన్ మద్ధతుదారులు మరోసారి దాడి చేశారు. రాత్రివేళ వచ్చిన ఖలిస్థాన్ మద్ధతుదారులు భారత కాన్సులేట్‌ కార్యాలయంపై దాడి చేసి నిప్పుపెట్టారు. (Indian consulate in San Francisco set on fire) ఐదు నెలల్లో ఖలిస్తానీ మద్దతుదారులు కాన్సులేట్‌ కార్యాలయంపై రెండోసారి దాడికి పాల్పడ్డారు.

Taliban Ban : అప్ఘానిస్థాన్‌లో మహిళా బ్యూటీ సెలూన్లపై తాలిబన్ల నిషేధాస్త్రం

ఖలిస్తానీ మద్దతుదారులు మార్చి నెలలో భారత కాన్సులేట్‌ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఖలిస్తానీ మద్దతుదారులు విడుదల చేసిన అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియోను ట్విట్టరులో దియా టీవీ షేర్ చేసింది. శాన్ ఫ్రాన్సిస్కో భారత కాన్సులేట్ కార్యాలయానికి అగ్నిమాపక అధికారులు వచ్చి మంటలను అదుపు చేశారు.

Pakistan : పాక్‌లో పరువు హత్యలు…ఇద్దరు కూతుళ్లను కాల్చిచంపిన తండ్రి

ఈ ఘటనపై అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ స్పందించారు. ఖలిస్థాన్ మద్ధతుదారులు చేసిన విధ్వంసం, కార్యాలయం దహన ప్రయత్నాలను యూఎస్ తీవ్రంగా ఖండిస్తుందని మాథ్యూ మిల్లర్ ట్వీట్ లో పేర్కొన్నారు. మార్చి నెలలో పంజాబ్ పోలీసులు భారతదేశంలో అమృతపాల్ సింగ్ కోసం దేశవ్యాప్తంగా శోధనను ప్రారంభించినప్పుడు, ఖలిస్థానీ మద్దతుదారులు శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌ను ధ్వంసం చేశారు.

Israel attacks : జెనిన్ నగరంపై ఇజ్రాయెల్ డ్రోన్ దాడి, 8 మంది పాలస్తీనియన్ల మృతి

భారత కాన్సులేట్‌పై దాడికి పాల్పడిన వీడియోలు బయటకు వచ్చాయి. కాన్సులేట్ ప్రాంగణంలో రెండు ఖలిస్థాన్ బ్యానర్‌లను ఏర్పాటు చేశారు. ఖలిస్థాన్ అనుకూల నినాదాలు చేస్తూ నిరసనకారులు భద్రతా అడ్డంకులను ఛేదించారు. అమెరికా దేశంలో దౌత్య కార్యాలయాలు, విదేశీ దౌత్యవేత్తలపై దాడి చేయడాన్ని హింసపూరిత నేరంగా పరిగణిస్తారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని యూఎస్ తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు