Indian-Origin: అమెరికాలో భారత సంతతి వ్యక్తి దారుణం.. కొండపై నుంచి కారు కింద పడగొట్టి భార్య, పిల్లల్ని చంపే యత్నం

క్యాలిఫోర్నియాలో ఉంటున్న ధర్మేష్ ఏ పటేల్ అనే 41 ఏళ్ల భారత సంతతి వ్యక్తికి భార్య, నాలుగేళ్ల కూతురు, తొమ్మిదేళ్ల కొడుకు ఉన్నారు. వాళ్లను చంపాలనుకున్న ధర్మేష్ తన టెస్లా కారులో కొండ ప్రాంతానికి తీసుకెళ్లాడు. కొండ అంచుకు తీసుకెళ్లి, కావాలని కారు లోయలో పడిపోయేలా చేశాడు.

Indian-Origin: అమెరికాలో భారత సంతతి వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. భార్య, ఇద్దరు పిల్లల్ని చంపేందుకు ప్రయత్నించాడు. దీనికోసం వారిని కారులో కొండ ప్రాంతానికి తీసుకెళ్లి, కారును లోయలోకి పడగొట్టాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన వాళ్లంతా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

TSRTC: నేటి నుంచి తెలంగాణలో టీఎస్ఆర్‌టీసీ స్లీపర్ క్లాస్ బస్సు సర్వీసులు ప్రారంభం

స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. క్యాలిఫోర్నియాలో ఉంటున్న ధర్మేష్ ఏ పటేల్ అనే 41 ఏళ్ల భారత సంతతి వ్యక్తికి భార్య, నాలుగేళ్ల కూతురు, తొమ్మిదేళ్ల కొడుకు ఉన్నారు. వాళ్లను చంపాలనుకున్న ధర్మేష్ తన టెస్లా కారులో కొండ ప్రాంతానికి తీసుకెళ్లాడు. కొండ అంచుకు తీసుకెళ్లి, కావాలని కారు లోయలో పడిపోయేలా చేశాడు. కారు దాదాపు 300 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో కారులో ఉన్న అతడితోపాటు, భార్య, ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జైంది. వెంటనే సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది రక్షణ చర్యలు చేపట్టారు. కారులోని ఇద్దరు పిల్లల్ని హెలికాప్టర్ల ద్వారా రక్షించారు. భార్యాభర్తల్ని వాహనాల్లో తరలించారు.

Chennai: ట్రక్కు కింద పడి మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి.. స్కూటీపై నుంచి గుంతలో పడటంతో దారుణం

నలుగురినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. పోలీసుల ప్రాథమిక అంచనా ప్రకారం.. ధర్మేష్, తన భార్య, పిల్లల్ని చంపేందుకు ప్రయత్నించాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడు కోలుకోగానే, అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. కాగా, ఈ ప్రమాదం నుంచి వాళ్లంతా ప్రాణాలతో బయటపడటం అద్భుతమే అంటున్నారు పోలీసులు. అంత ఎత్తు నుంచి కింద పడ్డప్పటికీ గాయాలతో బయటపడటం అరుదైన విషయమంటున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు