Indian Student: యుక్రెయిన్‌లో ఇండియన్ స్టూడెంట్ మృతి

యుక్రెయిన్ లోని షెల్లింగ్ లో ఇండియన్ స్టూడెంట్ మృతి చెందినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. 'మంగళవారం ఉదయం షెల్లింగ్ లోని ఖార్కివ్ లో భారత విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడని విచారణతో..

Indian Student: యుక్రెయిన్ లోని షెల్లింగ్ లో ఇండియన్ స్టూడెంట్ మృతి చెందినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ‘మంగళవారం ఉదయం షెల్లింగ్ లోని ఖార్కివ్ లో భారత విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడని విచారణతో ధ్రువీకరిస్తున్నాము. మంత్రిత్వ శాఖ అతని కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతోంది. మా తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం’ అని ట్వీట్ లో వివరించింది.

యుక్రెయిన్ లోని రెండో అతి పెద్ద నగరమైన ఖార్కివ్ రష్యా బలగాల దాడి కారణంగా అత్యంత దారుణంగా దెబ్బతిన్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో అతి పెద్ద బిల్డింగ్ కుప్పకూలినట్లు కనిపిస్తుంది.

ముందస్తు సూచనగా ఇండియన్ ఎంబస్సీ ప్రజలందరూ ఖాళీ చేయాలని యుక్రెయిన్ వదిలిపోవాలంటూ ప్రజలనుకోరింది. ట్రైన్లు, ప్రైవేట్ వాహనాలు ఏది కుదిరితే దానిలో వీలైనంత త్వరగా కీవ్ నగరం వదిలిపొమ్మని సూచించింది.

Read Alsor: కీవ్ నగరాన్ని అత్యవసరంగా ఖాళీ చేయాలని ఆదేశాలు.. ఏం జరగబోతోంది?

యుక్రెయిన్‌ ఆర్మీ ప్రజలను ఓ షీల్డ్‌లా ఉపయోగించుకుంటూ రష్యన్‌ ఆర్మీపై దాడులు చేస్తోందనేది రష్యా ఆరోపణ. అందుకే ప్రజలను కీవ్‌ను వదిలి వెళ్లాలంటూ సూచించింది. సాధారణ ప్రజలపై రష్యా ఎలాంటి దాడులు చేయదని ప్రకటించింది. దీంతో ఇక ఆర్టిలరీ గన్‌లు కీవ్‌లో ప్రజలు నివసించే ప్రాంతాలపై టార్గెట్‌ చేసేందుకు రెడీ అయ్యినట్టే చెప్పాలి.

లోపల ఏం చర్చించారన్నది మాత్రం బయటికి చెప్పలేదు. దీంతో చర్చలకు సై అంటూనే మరోవైపు చేయాల్సిందంతా చేస్తోంది రష్యా. కీవ్‌వైపు చీమల బారుల్లా రష్యా యుద్ధ వాహనాలు తరలివస్తూనే ఉన్నాయి. ఈ యుద్ధ వాహనాల కాన్వాయ్‌ ఒకటి రెండు కిలోమీటర్లు కాదు. ఏకంగా 64 కిలోమీటర్ల పొడువున్న రష్యన్‌ ఆర్మీ కాన్వాయ్‌ కీవ్‌వైపు దూసుకొచ్చినట్టు అమెరికన్‌ శాటిలైట్లు గుర్తించాయి.

 

ట్రెండింగ్ వార్తలు