Italy: కొడుకుల్ని ఇంటి నుంచి వెళ్లగొట్టాలంటూ కోర్టుకెక్కిన తల్లి.. కన్నతల్లి ఇంతదాకా రావడానికి కారణమేంటంటే?

తల్లి చాలాసార్లు వివరించడానికి ప్రయత్నించింది. అయితే అది ఇద్దరిపై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఆ మహిళ తన ఇద్దరు కుమారులతో కలిసి నివసిస్తోంది. కోర్టులో ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు.

Woman Legal Battle To Evict Sons From Home: ఈ ప్రపంచంలో తల్లి ప్రేమ తర్వాతే మరేదైనా అంటారు. తల్లికి ఉండే ఓపిక, సహనం, ప్రేమ అనిర్వచనీయం. పిల్లలు ఎలాంటి వారైనా తల్లి వారిని ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయదు, వదలదు. కానీ, తల్లికి కూడా ఓపిక, సహనం అనేవి ఉంటాయి. ఇక తన వల్ల కాదని అనిపించినప్పుడు కన్న పేగును కూడా వదులుకోవడానికి సిద్ధమవుతుంటారు. కానీ ఇలాంటి పరిస్థితిని ఏ తల్లీ జీర్ణించుకోదు. అయినప్పటికీ పరిస్థితులు అలా చేయిస్తాయి. ఇటలీలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది.

ఇటలీలోని పావియాలో తన కుమారుల పట్ల తీవ్ర నిరాశ చెందిన ఒక తల్లి కోర్టును ఆశ్రయించవలసి వచ్చింది. ఆ మహిళ తన సొంత కొడుకులపైనే కేసు పెట్టింది. తనకు ఇద్దరు కుమారులు ఉన్నారని, వారిని ఇంటి నుంచి వెళ్లగొట్టాలంటూ కోర్టును విజ్ణప్తి చేసింది. ఇద్దరు కుమారుల వయస్సు 40, 42 సంవత్సరాలు. కొడుకులిద్దరూ పని చేయరు. ఇంటి ఖర్చులకు ఎలాంటి సాయం అందివ్వరు. రోజంతా ఇంట్లో గొడవలు. కుమారుల చేష్టలకు విసిగి వేసారిన మహిళ ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని పలుమార్లు కోరింది.

ఇది కూడా చదవండి: Assembly Elections 2023: జోరుగా వారసత్వ రాజకీయాలు.. ఏ పార్టీ ఎంత మందికి టికెట్లు ఇచ్చిందంటే?

ఇంట్లో నుంచి బయటకు రాకుండా కొడుకులు మహిళను వేధించడం మొదలుపెట్టారు. ఇంటిని తమ పేరుపైకి మార్చాలని ఒత్తిడి చేయడం ప్రారంభించారు. కొడుకుల బెదిరింపులు, చేష్టలతో విసిగిపోయిన మహిళ వారిపై కేసు పెట్టింది. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి డిసెంబర్ 18లోగా ఇల్లు ఖాళీ చేయాలని కుమారులిద్దరికీ నోటీసులు జారీ చేశారు.

బాధిత మహిళ వయస్సు 75 సంవత్సరాలు. భర్త చనిపోవడంతో ఆమె పింఛన్‌తో కుటుంబం గడుపుతోంది. ఆ మహిళ తన ఇద్దరు కుమారులతో కలిసి నివసిస్తోంది. భర్త చనిపోయాక కొడుకు తన బాధ్యతలను అర్థం చేసుకుని సంపాదనతో పాటు ఇంటి పనుల్లో సాయం చేస్తాడని ఆ తల్లి ఆశపడింది. కానీ అందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. 40, 42 ఏళ్ల వయసున్న తన ఇద్దరు కుమారులు భోజనం చేసి తాగి ఇంట్లోనే ఉంటారని మహిళ పోలీసులకు తెలిపింది. తల్లి చాలాసార్లు వివరించడానికి ప్రయత్నించింది. అయితే అది ఇద్దరిపై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని తల్లి కోరగా.. కొడుకులు ఇంటిని స్వాధీనం చేసుకోవాలని బెదిరించడం మొదలుపెట్టారు.

ఇది కూడా చదవండి: Assembly Elections 2023: బీజేపీకి నిద్ర లేని రాత్రుల్ని ఇచ్చిన లేటెస్ట్ సర్వే.. ఇంతకీ ఆ సర్వేలో ఏముందో తెలుసా?

కొడుకుల తీరుతో మనస్తాపం చెందిన తల్లి కోర్టులో కేసు వేసింది. కోర్టులో న్యాయమూర్తి సిమోనోనా కేటర్బీ బాధిత మహిళకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. కోర్టు తీర్పు ప్రకారం.. డిసెంబర్ 18లోగా కొడుకులిద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోవాలని న్యాయమూర్తి ఆదేశించారు. సీఎన్ఎన్ న్యూస్ ప్రకారం, కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదులో, మహిళ తన కుమారులను పరాన్నజీవులు అని పేర్కొంది. తన కొడుకులు తనకు ఎలాంటి సహాయం చేయడం లేదని సదరు మహిళ న్యాయమూర్తికి తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు