Elon Musk: ఎలాన్ మస్క్ ట్విటర్ కొనుగోలుకు నెల రోజులు..! మస్క్ తీసుకున్న సంచలన నిర్ణయాలు ఇవే..

మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విటర్‌ను బిలియనీర్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ టేకోవర్ చేసుకొని నెల రోజులవుతుంది. ఈ నెలరోజుల్లో సంచలన నిర్ణయాలకు మస్క్ కేంద్ర బిందువుగా మారాడు.

Elon Musk: ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విటర్‌ను బిలియనీర్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ టేకోవర్ చేసుకొని నెల రోజులవుతుంది. ఈ నెలరోజుల్లో సంచలన నిర్ణయాలకు మస్క్ కేంద్ర బిందువుగా మారాడు. కీలక పదవుల్లో ఉద్యోగులతో పాటు 50శాతం మంది ఉద్యోగులను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ నెలరోజుల పాటు నిత్యం వార్తల్లో నిలిచిన మస్క్.. ట్విటర్ ను మరింత బలోపేతంచేసే దిశగా తనదైన రీతిలో ప్రయత్నాలు సాగిస్తున్నాడు.

Elon Musk: 2015లోనే మస్క్ ట్విటర్ కొనుగోలుపై గురిపెట్టాడా? మస్క్ షేర్‌చేసిన కార్టూన్ అర్థం ఏమిటో తెలుసా?

♦ ఎలాన్ మస్క్ అక్టోబర్ 27న ట్విటర్‌ను టేకోవర్ చేసుకున్నాడు. మస్క్ ట్విటర్ ను టేకోవర్ చేసుకొనే క్రమంలో ‘లెట్ దట్ సింక్ ఇన్’ అనే లిటరల్ మెమ్‌ను సూచిస్తూ మస్క్ సింక్ పట్టుకుని ట్విట్టర్ ఆఫీసులోకి వెళ్లాడు. కానీ, తరువాతి రోజుల్లో మస్క్ తీసుకున్న నిర్ణయాలు ట్విటర్ ఉద్యోగుల్లో గందరగోళాన్ని నెలకొల్పాయి.

♦ అక్టోబర్ 28న మస్క్ అప్పటి వరకు ట్విటర్ సీఈవోగా ఉన్న పరాగ్ అగర్వాల్, లీగల్ హెడ్ విజయ్ గద్దెతో పాటు ముగ్గురు టాప్ ఎగ్జిక్యూటీవ్‌లను తొలగించాడు.

♦ నవంబర్ 1న.. ట్విటర్ బ్లూ టిక్‌కు నెలకు నగదు చెల్లింపు ప్రక్రియను అమల్లోకి తెచ్చాడు. ట్విటర్ బ్లూటిక్ కావాల్సినవారు నెలకు 8డాలర్లుగా కట్టాల్సిందేనని ప్రకటించాడు.

♦ నవంబర్ 6న.. ‘పేరడీ’ లతో ఎవరినైనా కించపర్చేలా ప్రవర్తిస్తే అట్టి ఖాతాను సస్పెండ్ చేయబడుతుందని మస్క్ ట్వీట్ చేశాడు.

♦ మస్క్ తీసుకున్న నిర్ణయాల్లో అతిపెద్దది. ఉద్యోగుల తొలగింపు ట్విటర్లో  7,500 మంది వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. వారిలో సగం మంది విధుల నుంచి తొలగిస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

♦ బ్లూటిక్ ను సెలబ్రెటీలకే కాకుండా ప్రతీఒక్కరికి అందుబాటులో ఉంటుందని, 8డాలర్లు చెల్లించి బ్లూటిక్ ఎంపిక చేసుకోవచ్చని మస్క్ ప్రకటించారు.

♦ మస్క్ ప్రకటనతో సెలబ్రిటీలు, భారీ బ్రాండ్‌ సంస్థల పేర్లతో ఫేక్‌ అకౌంట్లు కుప్పలు తెప్పలుగా వెలిశాయి. ఈ క్రమంలో తీవ్ర విమర్శలు రావడంతో.. ఫేక్ అకౌంట్లు తేలేవరకు బ్లూటిక్‌ సబ్‌స్క్రిప్షన్‌ను ఆపేస్తున్నట్లు మస్క్ ప్రకటించాడు.

♦ నవంబర్ 22న బ్లూటిక్ ను 29న పునరుద్దరిస్తామని, ఫేక్ అకౌంట్లకు తావులేకుండా పరిశీలించిన తరువాత దీనిని అందుబాటులోకి తెస్తామని మస్క్ తెలిపాడు.

♦ మస్క్ తీసుకున్న మరో సంచలన నిర్ణయాల్లో ఉద్యోగులపై పనిభారం పెంచడం. మస్క్ ఉద్యోగులకు ‘ట్విట్టర్ 2.0’ ప్లాన్‌ను అమలు చేయాలని సూచించారు. అంటే.. ఉద్యోగులు అధిక గంటలు కష్టపడాలని అన్నాడు. ఇష్టలేనివారు మూడు నెలల ప్యాకేజీ షరతుతో ఉద్యోగాన్ని వదులుకోవచ్చని స్పష్టం చేశాడు.

♦ ఈ క్రమంలో చాలా మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు. ఈ క్రమంలో మస్క్ కొంత వెనక్కుతగ్గాడు.

♦ మస్క్ తీసుకున్న కీలక నిర్ణయాల్లో మరొకటి.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ట్విటర్ ఖాతాను మళ్లీ పునరుద్దరించడం. ఇందుకోసం మస్క్ ట్విటర్‌లో పోల్ పెట్టాడు. ఈ పోల్‌లో 51శాతంకుపైగా మంది ట్రంప్ ఖాతాను ట్విటర్‌లో పునరుద్దరించాలని పేర్కొన్నారు. వారి అభిప్రాయం మేరకు ట్రంప్ ఖాతాను ట్విటర్‌లో మస్క్ పునరుద్దరించాడు.

♦ అయితే, డొనాల్డ్ ట్రంప్ మాత్రం ట్విటర్లో పున:ప్రారంభానికి ఆసక్తిచూపలేదు.

♦ బ్లూటిక్ విషయంపై మస్క్ మరోసారి ట్వీట్ చేశాడు. బ్లూటిక్ ను మూడు రంగుల్లో తీసుకొస్తున్నామని అన్నారు.

♦ డిసెంబర్‌ 2 నుంచి తాత్కాలిక ప్రాతిపదికన వెరిఫైడ్‌ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ఎలాన్‌ మస్క్‌ ప్రకటించారు. కంపెనీలకు గోల్డ్‌, ప్రభుత్వ ఖాతాలకు గ్రే, వ్యక్తులకు బ్లూ టిక్‌ ఇవ్వనున్నట్లు వివరించారు. ఖాతాదారుల వివరాలను పూర్తిగా తనిఖీ చేసిన తరువాతే ఈ వెరిఫైడ్‌ టిక్‌ను కేటాయించస్తామన్నారు.

ట్రెండింగ్ వార్తలు