Trump Wife Ivana Death: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ కన్నుమూశారు. ముగ్గురు పిల్లల తల్లి అయిన ఇవానా వయసు 73 సంవత్సరాలు. ఇవానా మృతి విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ గురువారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. న్యూయార్క్‌లోని తన స్వగృహంలోనే ఇవానా ట్రంప్ మరణించారని, ఎంతో బాధతో ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్టు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్’లో పోస్టు చేశారు. ఆమె అందమైన, అద్భుతమైన మహిళ. గొప్ప స్ఫూర్తిదాయక జీవితాన్ని గడిపింది. ఆమెకు తన ముగ్గురు పిల్లలు డొనాల్డ్ జూనియర్, ఇవాంక, ఎరిక్లే సర్వస్వం. ఆమె పట్ల మేమూ గర్వపడుతున్నాం. ఇవానా ఆత్మకు శాంతి చేకూరాలి’ అని ట్రంప్ భావోద్వేగ సందేశాన్ని రాసుకొచ్చారు.
ఇవానా ట్రంప్‌ను డొనాల్డ్ ట్రంప్ 1977లో వివాహం చేసుకున్నారు.అనంతరం 1992లో విడాకులు తీసుకున్నారు. వీరికి డొనాల్డ్ జూనియర్, ఇవాంకా, ఎరిక్ ముగ్గురు సంతానం. కాగా, ఆమె మరణానికి కారణం ఏంటన్నది మాత్రం కుటుంబం వెల్లడించలేదు. ఇవానా మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మెట్ల దగ్గర అపస్మారక స్థితిలో పడి మరణించినట్లుగా తెలుస్తోంది. ఆమె ప్రమాదవశాత్తు మరణించిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇవానా మంచి వ్యాపారవేత్త. ఆమె అందంతో పాటు చక్కటి వ్యాపార మెళకువలు తెలిసిన అద్భుతమైన మహిళగా ఇవానాకు మంచి పేరుంది. అని..వ్యాపారంలో చక్కగారాణించారని..
తన పిల్లలకు స్నేహితులుగా ఉంచి మంచి సలహాలు బుతుండేవారని ఇబ్బందులు వస్తే..ఎప్పుడు మానసిక స్థైర్యాన్ని విడిచిపెట్టవద్దని చెబుతుండేవారని ఇవానా తోబుట్టువులు తెలిపారు. గతంలో భారత్ ను సందర్శించిన ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య కుమార్తె. తల్లి మరణం సందర్భంగా ఇవాంకా ట్రంప్ తన తల్లితో నవ్వుతూ మరియు నవ్వుతూ ఉన్న చిన్ననాటి ఫోటోలను పోస్ట్ చేసింది. ఆమె “తెలివైన, మనోహరమైన, ఉద్వేగభరితమైన..బ్యాడ్ ఫన్నీ” అంటూ అభివర్ణించింది.
Heartbroken by the passing of my mother. Mom was brilliant, charming, passionate and wickedly funny. She lived life to the fullest — never forgoing an opportunity to laugh and dance.
I will miss her forever and will keep her memory alive in our hearts always. ❤️ pic.twitter.com/EyhrLNLUJw
— Ivanka Trump (@IvankaTrump) July 14, 2022