Malaysia : గాల్లో ఢీకొన్న రెండు మిలటరీ హెలికాప్టర్లు.. 10 మంది మృతి.. వీడియో వైరల్

గాల్లో ఢీకొన్న హెలికాప్టర్లలో ఒకటి పక్కనే ఉన్న మైదానంలో కుప్పకూలిపోగా.. మరొకటి స్విమ్మింగ్ పూల్ లో పడిపోయింది. ఈ ప్రమాదంలో మృతుల్లో ఇద్దరు లెఫ్టినెంట్ కమాండర్లు కూడా ఉన్నారు.

Military Choppers Collide In Malaysia : మలేషియాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆ దేశంలో ఏప్రిల్ 26న రాయల్ మలేసియన్ నేవీ దినోత్సవం జరగనుంది. ఇందుకోసం లుముట్‌లోని నౌకాదళ స్థావరం ప్రాంతంలో రిహార్సల్స్ నిర్వహించారు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో రిహార్సల్స్ లో భాగంగా గాల్లోకి ఎగిరిన రెండు హెలికాప్టర్లు ఒకదానికి ఒకటి ఢీకొని కుప్పకూలిపోయాయి. ఈ ప్రమాదంలో 10 మంది నేవీ సిబ్బంది మరణించారు. హెలికాప్టర్లు ఢీకొని కిందపడిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Also Read : Bridge Collapses : పెద్దపల్లి జిల్లాలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి.. తప్పిన పెనుప్రమాదం

గాల్లో ఢీకొన్న హెలికాప్టర్లలో ఒకటి పక్కనే ఉన్న మైదానంలో కుప్పకూలిపోగా.. మరొకటి స్విమ్మింగ్ పూల్ లో పడిపోయింది. ఈ ప్రమాదంలో మృతుల్లో ఇద్దరు లెఫ్టినెంట్ కమాండర్లు కూడా ఉన్నారు. ఈ ఘటనపై మలేషియా నేవీ ఒక ప్రకటన విడుదల చేసింది. నేవీ 90వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రిహార్సల్స్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ఘటనలో 10 మంది మరణించగా.. వారి మృతదేహాలను హెలికాప్టర్ లో లుముట్ ఎయిర్ బేస్ ఆస్పత్రికి తరలించడం జరిగిందని మలేషియా నేవీ పేర్కొంది. ఈ ఘటనపై విచారణ నిమిత్తం కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

 

 

ట్రెండింగ్ వార్తలు