Kim Jong : ప్లీజ్ తక్కువ తినండి బాబు…కిమ్ వేడుకోలు

ప్లీజ్ తక్కువ తినండి బాబు..ఎక్కువ తినకండి అంటూ ఉత్తర కొరియా అధ్యక్షులు కిమ్ జాంగ్ ఉన్ దేశ ప్రజలను కోరుతున్నారు. ఎప్పటి వరకు అంటే..2025 వరకు అంట.

Eat Less Until 2025 : ప్లీజ్ తక్కువ తినండి బాబు..ఎక్కువ తినకండి అంటూ ఉత్తర కొరియా అధ్యక్షులు కిమ్ జాంగ్ ఉన్ దేశ ప్రజలను కోరుతున్నారు. ఇది ఎప్పటి వరకు అంటే..2025 వరకు అంట. అప్పటి వరకు తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవాలని ప్రజలు కోరడం హాట్ టాపిక్ అయ్యింది. ఆయన కోరడం వెనుక బలమైన కారణం ఉంది. ఆ దేశంలో భయంకరమైన ఆహార కొరత ఏర్పడింది. అయితే..ఈ కొరత ఎదుర్కోవడానికి..సమస్యను అధిగమించడం పోయి…ఇలాంటి ప్రకటన చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

Read More : Ostrich Running On Road: లాహోర్‌ రోడ్లపై నిప్పుకోడి హల్ చల్..వాహనదారులతో పోటీగా పరుగులు

పార్టీ నేతలతో కిమ్ భేటీ అయ్యారు. ఆహార కొరతపైనే ప్రధానంగా చర్చించారు. 2025 వరకు తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవాలని దేశ ప్రజలకు ఆయన సూచించారు. దేశంలో ఆహార కొరత ఏర్పడడం వ్యవసాయ రంగమే కారణమని, ఆహార ధాన్యాలు అందించడంలో వ్యవసాయ రంగం పూర్తిగా విఫలమైందంటూ ఆయన చెప్పుకొచ్చారు. గత సంవత్సరం సంభవించిన..టైపూన్, కరోనా వైరస్, భారీ వర్షాలు కూడా ఆహార సంక్షోభానికి కారణమంటున్నారు.

Read More : Female Martial Arts: బస్సులో వేధింపులు గురి చేస్తున్న వ్యక్తిని మార్షల్ ఆర్ట్స్‌తో చితకబాదిన మహిళ

ఉత్తర కొరియాలో కరోనా కారణంగా..కఠిన ఆంక్షలు విధించడం సరిహధ్దులు మూసివేత, వరుస విపత్తులతో అక్కడి పరిస్థితి మరింత దిగజారిపోయింది. అక్కడ జనాభాకు అనుగుణంగా ఆహార పదార్థాల ఉత్పత్తి జరగడం లేదు. దీంతో ఆహార పదార్థాల ధరలు పైకి ఎగబాకాయి. సరైన ప్రణాళిక లేకపోవడం, వ్యవసాయ పరిరకరాల కొరత..ఇతరత్రా కారణాల వల్ల ఆహార కొరత ఏర్పడిందని నిపుణులు అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు