Lionel Messi: మెస్సీకి బంపర్ ఆఫర్.. ‘వరల్డ్ కప్ బిష్ట్’ ఇస్తే రూ.8 కోట్లు ఇస్తానన్న ఒమన్ ఎంపీ

అర్జెంటినా సారథి మెస్సీకి ఖతార్ అధినేతలు ఒక సంప్రదాయబద్ధమైన ‘బిష్ట్’ అనే వస్త్రాన్ని బహూకరించారు. నలుపు రంగు కలిగిన ఈ వస్త్రం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇది ఖతార్, అరబ్ సంప్రదాయ వస్త్రం. చాలా అరుదైనది.

Lionel Messi: అర్జెంటినాకు వరల్డ్ కప్ సాధించిపెట్టిన లెజెండరీ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీకి తాజాగా ఒమన్ ఎంపీ ఒక బంపర్ ఆఫర్ ప్రకటించాడు. వరల్డ్ కప్ గెలిచిన అనంతరం ఇచ్చిన ‘బిష్ట్’ తిరిగి ఇచ్చేస్తే రూ.8 కోట్లు (1 మిలియన్ డాలర్లు) ఇస్తానని ప్రకటించాడు. గత వారం అర్జెంటినా వరల్డ్ కప్ గెలిచిన సంగతి తెలిసిందే.

United States: అమెరికాలో మంచు తుపాన్ ధాటికి 18 మంది మృతి.. కరెంటు లేక చీకట్లోనే 17 లక్షల మంది

ఈ సందర్భంగా అర్జెంటినా సారథి మెస్సీకి ఖతార్ అధినేతలు ఒక సంప్రదాయబద్ధమైన ‘బిష్ట్’ అనే వస్త్రాన్ని బహూకరించారు. నలుపు రంగు కలిగిన ఈ వస్త్రం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇది ఖతార్, అరబ్ సంప్రదాయ వస్త్రం. చాలా అరుదైనది. దీన్ని అక్కడి అరబ్ పాలకులు, కొద్దిమంది మత ప్రబోధకులు మాత్రమే ధరిస్తారు. ఒంటె వెంట్రుకలు, ఇతర అరుదైన మెటీరియల్ ఉపయోగించి దీన్ని తయారు చేస్తారు. అలాంటి బిష్ట్‌ను మెస్సీకి బహూకరించడం అంటే గొప్ప విషయమే. మెస్సీకి దీన్ని అందించిన తర్వాతే ఈ బిష్ట్ గురించి ప్రపంచానికి తెలిసింది. అయితే, ఇప్పుడు ఈ బిష్ట్ తనకు కావాలంటున్నాడు ఒమన్‌కు చెందిన ఒక ఎంపీ. అహ్మద్ అల్ బర్వాని అనే ఒమన్ ఎంపీ, లాయర్ ఈ మేరకు మెస్సీకి ఒక ఆఫర్ ప్రకటించాడు. దీని ప్రకారం ఆ బిష్ట్‌ను మెస్సీ తనకు తిరిగిస్తే, బదులుగా మిలియన్ అమెరికన్ డాలర్లు (రూ.8.2 కోట్లు) ఇస్తానని ప్రకటించాడు.

PAN-Aadhaar: మార్చి 31లోపు ఆధార్ లింక్ చేయకపోతే పాన్ రద్దు.. ఐటీ శాఖ చివరి హెచ్చరిక

‘‘ప్రపంచ కప్ గెలిచినందుకు ముందుగా మెస్సీకి అభినందనలు. అరబిక్ బిష్ట్.. శౌర్యానికి, జ్ఞానానికి ప్రతీక. ఈ బిష్ట్ తిరిగిస్తే దానికి బదులుగా మిలియన్ అమెరికన్ డాలర్లు ఇస్తా’’ అని బర్వాని ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా అహ్మద్ అల్ బర్వాని స్టేడియంలోనే ఉన్నాడు. ఈ బిష్ట్‌ను ఒమన్‌లో సంప్రదాయబద్ధంగా పరిరక్షిస్తానని చెప్పాడు. అయితే, దీనిపై మెస్సీ స్పందించలేదు. మెస్సీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఆటగాడు. ఆయన ఇమేజ్, మార్కెట్ పరిధి అపరిమితం. అందువల్ల ఇలాంటి వాటికి మెస్సీ స్పందించే అవకాశాలు చాలా తక్కువ.

 

 

ట్రెండింగ్ వార్తలు