నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం.. భారీ వర్షాల వల్ల ఏడుగురి మృతి

Heavy rains: తెలకపల్లి మండల కేంద్రంలో పిడుగు పడి లక్ష్మణ్ (13) అనే బాలుడు మృతి చెందాడు.

నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల వల్ల ఏడుగురు మృతి చెందారు. తాడూర్ మండల కేంద్రంలోని ఇంద్రకల్ సమీపంలో కొల్ల షెడ్డు గోడ కూలి నలుగురు మృతి చెందారు. వారి పేర్లు మల్లేశ్, అనుష , చెన్నమ్మ, రాములు. అలాగే, మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

తెలకపల్లి మండల కేంద్రంలో పిడుగు పడి లక్ష్మణ్ (13) అనే బాలుడు మృతి చెందాడు. బిజినపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామంలో పిడుగు పడి గోపాల్ రెడ్డి (45) ప్రాణాలు కోల్పోయాడు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో మంతటి చౌరస్తాలో కారులో కూర్చున్నాడు వేణుగోపాల్ అనే వ్యక్తి. అతడి పక్కనే ఉన్న రేకుల షెడ్డులోని ఇటుక పెళ్ల ఎగిరి వచ్చి పడి గ్లాస్ గుచ్చుకొని అతడు మృతి చెందాడు.

అలాగే, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాగర్ కర్నూలు, కొడంగల్, గద్వాలలో భారీ వర్షం పడుతోంది. మరికొన్ని జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మేడ్చల్‌లో చెట్టుకూలి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

Rains in Hyderabad: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం

ట్రెండింగ్ వార్తలు