IPL 2024 Final : ఐపీఎల్ టైటిల్ కోల్‌కతాదే.. 8 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై ఘన విజయం

KKR vs SRH: ఐపీఎల్ 2024‌ టైటిల్ కోల్‌కతా నైట్ రైడర్స్ కైవసం చేసుకుంది. ఐపీఎల్‌లో కోల్‌కతా ముచ్చటగా మూడోసారి టైటిల్ దక్కించుకుంది.

IPL 2024 Final : ఐపీఎల్ 2024‌ టైటిల్ కోల్‌కతా నైట్ రైడర్స్ కైవసం చేసుకుంది. ఐపీఎల్‌లో కోల్‌కతా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది. చెన్నై వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన తుది పోరులో కేకేఆర్ (KKR) కేవలం 10.3 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి 114 పరుగులతో ఘన విజయం సాధించింది. హైదరాబాద్ నిర్దేశించిన 113 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా సునాయసంగా ఛేదించింది.

ఓపెనర్ సునీల్ నరైన్ (6) పరుగులకే ఆదిలోనే చేతుల్తేశాడు. మరో ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (39; 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్) రాణించాడు. ఆ తర్వాత బరిలోకి దిగిన వెంకటేష్ అయ్యర్ (52 నాటౌట్; 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్) హాఫ్ సెంచరీ, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (6 నాటౌట్) పరుగులతో అజేయంగా నిలిచారు. వీరిద్దరూ దూకుడుగా ఆడుతూ కోల్‌కతా విజయంలో కీలక పాత్ర పోషించారు. కోల్‌‌కతాను కట్టడి చేసేందుకు హైదరాబాద్ బౌలర్లు ప్రయత్నించి విఫలమయ్యారు. పాట కమిన్స్, షాబాజ్ అహ్మద్ తలో వికెట్ తీసుకున్నారు.

హైదరాబాద్ పతనాన్ని శాసించిన మిచెల్ స్టార్క్‌(2/14)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

కుప్పకూలిన హైదరాబాద్ :
అంతకుముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.3 ఓవర్లలో 113 పరుగులకు అలౌట్ అయింది. హైదరాబాద్ పూర్తిగా తేలిపోయింది. ఎస్ఆర్‌హెచ్ టాప్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ హేట్ ఫస్ట్ డౌన్‌లో వచ్చిన రాహుల్తి పార్టీ పూర్తిగా విఫలమయ్యారు. రెండో రౌండ్‌లో క్రీజులోకి వచ్చిన మార్క్రం నితీష్ రెడ్డితో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.

ఈ జోడిని హర్షిత్ రానా విడగొట్టాడు. 47 పరుగుల వద్ద గుర్భాజ్‌కు క్యాచ్ ఇచ్చి నితీష్ రెడ్డి వెనుతిరికాడు. స్వల్ప వ్యవధిలోనే తరువాత క్రీజులోకి వచ్చిన వారిలో కెప్టెన్ మినహా మిగతా వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమైపోయారు. 3 వికెట్లు పడగొట్టగా స్టార్క్ హర్షిత్ రానా తలో రెండు వికెట్లు, వరుణ్, నరైన్, ఆరూర తలో వికెట్ తీసుకున్నారు.

ముచ్చటగా మూడోసారి :
గతంలో 2012, 2014 ఐపీఎల్ టైటిల్ దక్కించుకున్న కోల్‌కతా ఈ ఏడాది 2024 ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకుంది. తద్వారా మూడోసారి విజేతగా కేకేఆర్ అవతరించింది. ట్రోఫిని ముద్దాడిన కోల్‌‌కతాకు రూ. 20 కోట్లు, రన్నరప్ జట్టుగా నిలిచిన హైదరాబాద్ జట్టుకు రూ. 13 కోట్ల ప్రైజ్ మనీ దక్కనుంది.

కన్నీరుపెట్టిన కావ్యా పాప.. :
ఐపీఎల్ టైటిల్ పోరులో కోల్‌కతా చేతిలో ఘోర పరాజయం పాలైన హైదరాబాద్ ప్రాంఛైజీ యజమాని కావ్యా మారన్ కన్నీటిపర్యంతమయ్యింది. కేకేఆర్ విజయం అనంతరం కావ్య మళ్లీ స్టాండ్స్‌లో కనిపించారు. ఫైనల్ వరకు వచ్చినందుకు ఎస్ఆర్‌హెచ్ జట్టును ఆమె అభినందించింది. ఎస్ఆర్‌హెచ్ ఓటమి చవిచూడటాన్ని తట్టుకోలేకపోయారు.

కన్నీటిని దాచుకోలేక ఆమె కెమెరాలకు కంటపడకుండా ఉండేందుకు పక్కకు తిరిగి నిలబడ్డారు. కన్నీటిని తుడుచుకుంటున్న ఆమె తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కావ్య కంటతడి పెట్టడంపై సన్‌రైజర్స్ ఫ్యాన్స్ స్పందించారు. ‘ధైర్యంగా ఉండండి మేడమ్’అంటూ కామెంట్లు పెడుతున్నారు. కీలక పోరులో హైదరాబాద్ పేలవమైన ఆటతీరుతో తీవ్రంగా నిరాశపరిచిందని, కావ్యను కంటతడి పెట్టించిందని అభిమానులు విమర్శిస్తున్నారు.

మ్యాచ్ విజయంపై కేకేఆర్ ఆటగాళ్ల స్పందన :
హైదరాబాద్‌తో తుదిపోరులో కోల్‌కతా విజేతగా నిలవడంపై ఆ జట్టు ప్లేయర్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ ట్రోఫీని ముచ్చటగా మూడోసారి కైవసం చేసుకోవడంపై తమ సంతోషాన్ని తెలియజేస్తున్నారు.

మా సంతోషాన్ని వ్యక్తపరచలేకపోతున్నా: బౌలర్ హర్షిత్ రానా
మ్యాచ్ అనంతరం కేకేఆర్ బౌలర్ హర్షిత్ రానా మాట్లాడుతూ.. మా సంతోషాన్ని వ్యక్తపరచలేకపోతున్నామని తెలిపాడు.

నా కల నెరవేరింది : బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్ :
ఈ ఫీలింగ్ చాలా అద్భుతంగా ఉంది. నా కల నెరవేరింది. కేకేఆర్ జట్టుతో ఏడేళ్లుగా ఆడుతున్నాను. ఈ క్రెడిట్ అంతా మా కోచ్ గౌతమ్ గంభీర్‌కే దక్కుతుంది.

పదేళ్ల తర్వాత కప్ కొట్టాం : వెంకటేష్ అయ్యర్
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన వెంకటేష్ అయ్యర్ (52) అజేయంగా నిలిచాడు. మ్యాచ్ విజయంపై అతడు మాట్లాడుతూ.. చాలా సంతోషంగా ఉందన్నాడు. ఈ విన్నింగ్ క్రెడిట్ అంతా మా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ కే దక్కుతుందన్నాడు. కేకేఆర్ కోసం ఆయన శ్రమించిన తీరు అద్భుతమన్నాడు. పదేళ్ల తర్వాత కప్ కొట్టామని, ఈ క్రెడిట్ మేనేజ్‌మెంట్ తో పాట కోచింగ్ స్టాఫ్ కూడా దక్కుతుందని అయ్యర్ చెప్పాడు.


హైదరాబాద్‌పై 8 వికెట్ల తేడాతో కోల్‌కతా విజయం : 
ఐపీఎల్ టైటిల్ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో హైదరాబాద్ జట్టుపై ఘన విజయం సాధించింది. కేవలం 10.3 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి 114 పరుగులతో ఘన విజయం సాధించింది.

రెండో వికెట్ కోల్పోయిన కోల్‌కతా :
కోల్‌కతా 102 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 8.5 ఓవర్లలో కోల్‌కతా 2 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ రహ్మానుల్లా గుర్భాజ్ (32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్) 39 పరుగులకు ఔటయ్యాడు. షాబాద్ అహ్మద్ బౌలింగ్‌లో ఎల్బీ డబ్ల్యూగా వెనుదిరిగాడు. 8.5 ఓవర్లకు 102/2 స్కోరుతో కొనసాగుతోంది. 

తొలి వికెట్ కోల్పోయిన కోల్‌కతా :
కోల్‌కతా 11 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. సునీల్ నరైన్ ఆడిన 2 బంతుల్లోనే 6 పరుగులతో ఔట్ అయ్యాడు. పాట్ కమిన్స్ బౌలింగ్‌లో షాబాజ్ అహ్మద్‌కు క్యాచ్ ఇచ్చి నరైన్ పెవిలియన్ చేరాడు. 6 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి కోల్‌కతా స్కోరు 72 పరుగులతో కొనసాగుతోంది.

హైదరాబాద్ ఆలౌట్ :
హైదరాబాద్ జట్టు 18.3 ఓవర్లకు ఆలౌట్ అయింది. కోల్‌కతా ముందు కేవలం 114 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కమ్మిన్స్ 24, జయదేవ్ 4 పరుగులు మాత్రమే చేశారు. హైదరాబాద్ బ్యాటర్లు ఏ మాత్రమూ రాణించలేకపోయారు.

8వ వికెట్
హైదరాబాద్ జట్టు ఎనిమిదో వికెట్ కోల్పోయింది. క్లాసిన్ 16 పరుగులు చేసి ఔటయ్యాడు.

7వ వికెట్ కోల్పోయిన హైదరాబాద్
మరో వికెట్ పడింది. 7వ వికెట్ కోల్పోయింది హైదరాబాద్. అబ్దుల్ సమాద్ 4 పరుగులు చేసి వెనుదిరిగాడు.

6వ వికెట్ డౌన్
హైదరాబాద్ జట్టు మరో వికెట్ కోల్పోయింది. షాబాజ్ అహ్మద్ 8 పరుగులు చేసి ఔటయ్యాడు. స్కోరు 12 ఓవర్ల నాటికి 71-6గా ఉంది. 

5వ వికెట్ డౌన్
హైదరాబాద్ జట్టు 5వ వికెట్ కోల్పోయింది. రాహుల్ మార్క్రాం 20 పరుగులకే వెనుదిరిగాడు. స్కోరు 11 ఓవర్ల నాటికి 64-5గా ఉంది.

నాలుగో వికెట్ కోల్పోయిన హైదరాబాద్
హైదరాబాద్ జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. నితీశ్ రెడ్డి 13 పరుగులకే ఔటయ్యాడు. స్కోరు 7 ఓవర్లకు 47-4గా ఉంది.

మూడో వికెట్ కోల్పోయిన హైదరాబాద్
హైదరాబాద్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. రాహుల్ త్రిపాఠి 9 పరుగులకే వెనుదిరిగాడు. స్కోరు 4.2 ఓవర్ల నాటికి 21-3గా ఉంది.

ఒక్క పరుగూ చేయకుండా హెడ్ ఔట్
ఒక్క పరుగూ చేయకుండానే ట్రావిస్ హెడ్ ఔట్ అయ్యాడు. స్కోరు 2 ఓవర్ల నాటికి 10-2గా ఉంది.

తొలి ఓవర్లోనే అభిషేక్ ఔట్
తొలి ఓవర్లోనే 2 పరుగుల వద్ద హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ ఔట్ అయ్యాడు. స్టార్క్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తొలి ఓవర్లో కేవలం 3 పరుగులు దక్కాయి.

ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు: రహ్మానుల్లా గుర్బాజ్, సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ సబ్స్: ఉమ్రాన్ మాలిక్, గ్లెన్ ఫిలిప్స్, మయాంక్ మార్కండే, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్

కోల్‌కతా నైట్ రైడర్స్ ఇంపాక్ట్ సబ్స్: అనుకుల్ రాయ్, మనీశ్ పాండే, నితీశ్ రాణా, కేఎస్ భరత్, రూథర్‌ఫోర్డ్

ట్రెండింగ్ వార్తలు