Guinness World Record : ఇతడికి సినిమా అంటే పిచ్చి.. ‘స్పైడర్ మ్యాన్’ ఏకంగా 292 సార్లు చూశాడు.. గిన్నిస్ వరల్డ్ రికార్డు

Guinness World Record : ఇతడికి సినిమాలంటే పిచ్చి.. అదే అతడ్ని గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డు సాధించేలా చేసింది. ఇతడు చేసిందిల్లా ఒకటే.. చూసిన సినిమానే చూడటం..

Guinness World Record : ఇతడికి సినిమాలంటే పిచ్చి.. అదే అతడ్ని గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డు సాధించేలా చేసింది. ఇతడు చేసిందిల్లా ఒకటే.. చూసిన సినిమానే చూడటం.. ఏకంగా 292 సార్లు సినిమా చూశాడు.. అది కూడా హాలీవుడ్ మూవీ స్పైడర్ మ్యాన్ మూవీని.. ఇంకేముంది గిన్నిస్ వరల్డ్ రికార్డులకు ఎక్కేశాడు. ఫ్లోరిడాకు చెందిన ఈ యువకుడు రామిరో అలానిస్.. ఇప్పటికే సినిమాలు ఎక్కువ సార్లు ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు. సాధారణంగా ఎవరైనా సినిమా ఒకసారి చూస్తారు.. నచ్చితే రెండుసార్లు.. అదే ఫేవరెట్ హీరో సినిమా అయితే.. మరో మూడు లేదా మహా అయితే పది సార్లు చూస్తారేమో.. అప్పటకే బోర్ కొట్టేస్తుంది..

కానీ, ఫ్లోరిడియాకు చెందిన యువకుడు మాత్రం లేటెస్టుగా ‘Spider-Man: No Way Home’ మూవీని కేవలం 3 నెలల సమయంలో 292 సార్లు చూసి అరుదైన రికార్డు నెలకొల్పాడు. డిసెంబర్ 16, 2021, మార్చి 15, 2022 మధ్య వరకు స్పైడర్ మ్యాన్ మూవీని వందల సార్లు థియేటర్లలో చూశాడు. ఈ మూవీ రన్ టైమ్ 720 గంటలు.. దాంతో రామిరోకు 30 రోజులు సమయం తీసుకున్నాడు. అయినా రామిరోకు సినిమాలు చూసి రికార్డులు నెలకొల్పడం కొత్తమే కాదు.. గతంలోనూ అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

2019లో ఎవెంజర్స్: ఎండ్‌గేమ్‌ను 191 సార్లు చూసి రికార్డు నెలకొల్పాడు. అయితే తన పాత రికార్డును 2021లో ఆర్నాడ్ క్లీన్ బద్దలు కొట్టాడు. కామ్ లోట్ ఫస్ట్ ఇన్ స్టాల్ మేంట్ సినిమాను ( Kaamelott: First Installment) 204 సార్లు చూశాడు. ఒకే సినిమాను అత్యధిక సార్లు చూసిన వ్యక్తిగా నెంబర్ వన్ రికార్డును కొనసాగించాలని రామిరో భావిస్తున్నాడు. స్పైడర్ మాన్ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి అది థియేటర్లలో షో వేయడం ఆపే వరకు బ్యాక్-టు-బ్యాక్ చూసేవాడట.. ప్రతిరోజూ 5 స్క్రీనింగ్‌లను చూసేవాడినని రామిరో చెప్పుకొచ్చాడు. రామిరో గిన్నిస్ వరల్డ్ రికార్డుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also : 1984 Spider Man Comic : స్పైడర్ మ్యాన్ పుస్తకంలో ఒకే ఒక్క పేజీ ధర రూ.24 కోట్లు..!!

ట్రెండింగ్ వార్తలు