Earnings with garbage : చెత్త ఏరుకుంటూ నెలకు రూ.3లక్షలు సంపాదిస్తు సెలబ్రిటీ అయిపోయింది

చేసే ఉద్యోగం మానివేసి చెత్త ఏరుకుంటు సెలబ్రిటీ అయిపోయింది ఓ మహిళ. చెత్త ఏరుకుంటూ నెలకు రూ.3లక్షలు సంపాదిస్తు సెలబ్రిటీ కూడా అయిపోయింది.

Mother Becomes Dumpster Diver : చెత్త చూస్తే ముక్కు మూసుకుని ముఖం తిప్పుకుని వెళ్లిపోతాం. కానీ ఓ మహిళ ‘చెత్త కథ’ వింటే..ఆ చెత్తవైపే ఆశగా చూస్తాం. చక్కగా చేసుకునే ఉద్యోగం మానేసి చెత్త ఏరుకుని నెలకు లక్షల రూపాయలు సంపాదించే మహిళ ‘చెత్త కథ’ వింటే ఈ చెత్తే ఏరుకోవటానికి పరుగులు పెడతారు. మరి ఆ మహిళ ‘చెత్త కథ’ కాదు కాదు సక్సెస్ స్టోరీ ఏంటంటే..

అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ లో టిఫ్ఫానీ అనే మహిళ చెత్త ఏరుకుంటూ నెలలకు రూ.3 లక్షలు సంపాదిస్తోంది. గతంతో తాను చేసే ఉద్యోగం మానేసి చెత్త ఏరుకుంటూ లక్షలు సంపాదించే ఆమె స్టోరీ తెలుసుకున్నవారంతా ఔరా..ఈ చెత్త కథలో ఇంత విషయం ఉందా? కాదు కాదు ఇంత డబ్బులున్నాయా? అని ఆశ్చర్యపోతున్నారు.32 ఏళ్ల టెఫ్ఫానీ గతంలో ఓ కేఫ్‌లో ఫుల్ టైమ్ జాబ్ చేసేది. కానీ ఆ ఉద్యోగం ఆమెకు నచ్చేదికాదు. కానీ వేరే ఉద్యోగం దొరకాలంటే కాస్త కష్టమే. కానీ రాజీ పడుతు ఉద్యోగం చేస్తుండేది. కానీ ఇష్టం లేని జాబ్ ఎన్నాళ్లు చేయాలనిపించి రిజైన్ చేసేసింది.

కానీ ఏం చేయాలో తెలియలేదు. ఏదోకటి చేయాలని అనిపించేది. అలా చెత్త ఏరేవాళ్లను చూసేది. విసుగు విరామం లేకుండా ఇలా చెత్త ఏరుతుంటారు కదా..వీరి సంపాదన బాగానే ఉంటుందనుకుంటా లేకపోతే రోజంతా ఎందుకలా చెత్త ఏరుతారు? అనిపించింది. అంతే..చేసే పనిలో నిజాయితీ ఉండాలి గానీ..చిన్న పని పెద్ద పని అని ఉండదని నమ్మిన టెప్ఫానీ చెత్త ఏరే పనిలో పడింది. అలా చెత్త ఏరటం మొదలు పెట్టింది. అలా ఆమె సేకరించిన చెత్త అమ్మగా వారానికి 1000 డాలర్లు వచ్చాయి. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.74,000. కేఫ్ లో పనిచేసినా ఆమెకు నెలంతా కష్టపడినా అంత వచ్చేది కాదు. ఇది ఆమె జాబ్ వదిలేసి చెత్త పనిలో చేరిన 2016 నాటి మాట. కానీ టెఫ్ఫానీ సంపాదన ఇప్పుడు నెలకు రూ.3లక్షలు.

చెత్త ఏరిన తరువాత ఆమె చెత్తలో రీ-సైక్లింగ్ చేయగలిగేవి, కొద్దిగా వాడి పారేసిన చాలా వస్తువులు కనిపిస్తే వాటిని డివైడ్ చేసేది. స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, వాటర్ బాటిల్స్, మేకప్ ఐటెమ్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, వీడియో గేమ్‌లు, కలర్స్ స్కెచ్చెస్, డెలివరీ అట్టపెట్టెలు ఇలా బోలెడన్ని ఉండేవి ఆమె సేకరించిన చెత్తలో. వాటిని అవసరమైనవారికి తక్కువ ధరకు అమ్ముతోంది. అలా మొదటి నెల 88,146 వేలు సంపాదించింది. ఇదేదో బాగుందే అనిపించింది. అలా చెత్త ఏరటంలో కంటిన్యూ అయిపోయింది.

టిఫ్పానీ సంపాదన నెల నెలకు పెరుగుతుంటే ఆమె భర్త డేనియల్ రోచ్ ఆశ్చర్యపోయాడు. ఏం చేస్తున్నావ్? అని అడిగాడు.దానికి ఆమె తన ‘చెత్త కథ’ చెప్పింది. నువ్వేం చేస్తున్నావో నాకు చూపించు లేకపోతే నమ్మను అని అన్నాడు. అలా భార్య సేకరించిన చెత్త దగ్గరకు వెళ్లిన డేనియల్ ఆశ్చర్యపోయాడు. ఆ రీసైక్లింగ్ వస్తువులు చూసిన డేనియల్ ఉద్యోగం మానేసి ఏం చేస్తుందా? అనుకున్నాను..బాగానే ఉంది నీ ‘చెత్త కథ’ చెత్తపై వచ్చే నీ సంపాదన అంటూ నవ్వేశాడు. నీ సంపాదన సీక్రెట్ ఇదన్నమాట అన్నాడు.

2016 నుంచి ఇప్పటి వరకూ టిఫ్పానీ చెత్త పని చేస్తూనే ఉంది.అలా ఐదేళ్లుగా ఆమె సంపాదన కూడా పెరిగింది. ఉద్యోగం చేస్తే వచ్చేదానికి కంటే రెండు మూడు రెట్లు ఎక్కువ రావటంతో ఆ చెత్తపనినే కంటిన్యూ చేస్తోంది. సాధారణంగా చెత్త ఏరుకునే వారిని చిన్న చూపు చూస్తారు. అలాంటి ఆలోచనను టిఫ్పానీ మార్చి పడేసింది.

చెత్త ఏరుకోవటం తప్పుకాదు..కష్టపడి చేసే ఏ పనీ కూడా తప్పుకాదని నిరూపించాలనుకుంది. అలా టిక్ టాక్ అకౌంట్ ఓపెన్ చేసి తన ‘చెత్త సంపాదన’ గురించి చెబుతోంది.ఇది నీ చెత్త జర్నీ అని చెప్పుకొస్తోంది. ఇప్పుడామెకు టిక్‌టాక్‌లో 20 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. దీంతో ఆమె సెలబ్రిటీ అయిపోయింది.

తన కథ గురించి చెబుతు నేను చెత్త ఏరటం మొదలుపెట్టాకే తన ఫ్యామిలీ ఫైనాన్షియల్ పొజిషన్ చక్కగా పెరిగిందని చెబుతోంది. నాకు నలుగురు పిల్లలు. వారందర్నీ చక్కగా ఏలోటు లేకుండా పెంచగలుగుతున్నామని చెబుతోంది.అంతేకాదు తల్లిగా టెప్ఫానీ తన బిడ్డలకు ఏ పని చిన్నది కాదని చెప్పటానికి వారితో కూడా చెత్త ఏరిస్తోంది. ఆ పనిలో పిల్లలకు ఆమె చక్కటి విషయాలు చెబుతోంది. తల్లితోపాటూ చెత్త ఏరుతూ వారి పాకెట్ మనీ సంపాదించుకోవటంతో పాటు ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు టెప్ఫానీ పిల్లలు.

అలా చెత్త ఏరుతున్న క్రమంలో ఆమెకు ఓ చోట చెత్తలో కాఫీ మెషిన్ దొరికింది. అది ఎవరికి అవసరమో తెలుసుకుని వారికి తక్కువ ధరకే అమ్మింది. చక్కగా డబ్బులు వచ్చాయి. అవసరమైనవారికి కాఫీ మెషిన్ తక్కువ ధరకే లభించిందిజ శ్రీమంతులు చాలా విలువైన వస్తువుల్ని చెత్తలో పడేస్తున్నారు. అవి ఆమెకు దొరికితే వాటిని అమ్ముకుంటూ… రెండు చేతులా సంపాదిస్తోంది టిఫ్పానీ. అదే సమయంలో భూమిపై ఎంతో కొంత చెత్తను తగ్గిస్తూ తనవంతుగా పర్యావరణానికీ మేలు కలిగేలా చేస్తోంది. అలా డబ్బుకు డబ్బు వస్తోంది. తను చెత్త ఏరుతున్న వీడియోలను టిక్ టాక్ లో పెట్టి ఫాలోవర్స్ ని పెంచుకుంటోంది. మరోపక్క అవసరమైనవారికి వస్తువులు తక్కువ ధరకు లభించేలా చేస్తోంది. మరి ఈ ‘చెత్తకథ’ ఎలా ఉంది?

ట్రెండింగ్ వార్తలు