New Zealand: ఆందోళనకారులు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు: న్యూజీలాండ్ ప్రధాని

కరోనా వ్యాక్సిన్ పై కెనడాలో ట్రక్ డ్రైవర్ల ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడిన తరహాలోనే వారిని స్ఫూర్తిగా తీసుకుని న్యూజీలాండ్ లోనూ ట్రక్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు.

New Zealand: న్యూ జీలాండ్ లో కరోనా ఆంక్షలు తొలగించాలంటూ వేలాదిమంది ప్రజలు ఆందోళనకు దిగడంపై ఆ దేశ ప్రధాని జసిండా ఆర్డెర్న్ స్పందించారు. అర్ధం లేని ఆందోళనలతో కొందరు కావాలనే ఇలా రాద్ధాంతం చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. covid -19 వ్యాక్సిన్ కు వ్యతిరేకంగా న్యూజీలాండ్ లో జరుగుతున్న ఆందోళనలు రెండో వారానికి చేరుకున్నాయి. “వ్యాక్సిన్ తప్పనిసరి” అంటూ ప్రభుత్వం తెచ్చిన నిబంధనలపై వెనక్కు తగ్గాలని, అదే సమయంలో కరోనా తగ్గుముఖం పడుతుండగా ఇంకా ఆంక్షలు కొనసాగించడం ఏంటంటూ వేలాదిమంది ప్రజలు నిరసనకు దిగారు. అయితే ఈ నిరసనలను వేరే దేశాల నుంచి “స్ఫూర్తి పొందినవిగా” జసిండా ఆర్డెర్న్ అభివర్ణించారు. గతంలో తానెప్పుడూ ఇటువంటి నిరసనలను చూడలేదని ఆమె పేర్కొన్నారు.

Also read: Stock Market: కుప్పకూలిన స్టాక్ మార్కెట్ రూ.లక్షల కోట్ల సంపద ఆవిరి

కెనడాలో ట్రక్ డ్రైవర్లకు కరోనా వ్యాక్సిన్ తప్పనిసరి చేస్తూ ఆ దేశం తీసుకొచ్చిన “వ్యాక్సిన్ మ్యాండేట్”పై ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడిన తరహాలోనే వారిని స్ఫూర్తిగా తీసుకుని న్యూజీలాండ్ లోనూ ట్రక్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. భారీ వాహనాలను రోడ్లపైకి తీసుకువచ్చి నిరసనలు తెలిపారు. “రాజకీయ నాయకులను ఉరితీయాలని పిలుపునిచ్చే సంకేతాలను చూసినప్పుడు, ఇది నిజంగా ప్రభుత్వానికి సహకరించే నిరసనలు కాదని, దురుద్దేశ్యంతోనే కొందరు పనిగట్టుకుని ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు చేస్తున్న కుట్రలా భావించాల్సి వస్తుందని ప్రధాని జసిండా ఆర్డెర్న్ అన్నారు. నిరసనకారులు ప్రభుత్వంతో మాట్లాడేందుకు కూడా సిద్ధంగా లేరంటే వారి వెనుక మరెవరో ఉంది నడిపిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు.

Also read: Stock Market: కుప్పకూలిన స్టాక్ మార్కెట్ రూ.లక్షల కోట్ల సంపద ఆవిరి

ట్రెండింగ్ వార్తలు