North Korea : ఉత్తర కొరియా మళ్లీ పలు క్రూయిజ్ క్షిపణుల ప్రయోగం…తీవ్ర ఉద్రిక్తత

ఉత్తర కొరియా శనివారం మళ్లీ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది. దీంతో దక్షిణ కొరియా, ఉత్తర కొరియా దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొరియా ద్వీపకల్పానికి పశ్చిమాన ఉన్న సముద్రం వైపు ఉత్తర కొరియా పలు క్రూయిజ్ క్షిపణులను శనివారం ప్రయోగించింది.....

North Korea Fires Missiles

North Korea : ఉత్తర కొరియా శనివారం మళ్లీ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది. కొరియా ద్వీపకల్పానికి పశ్చిమాన ఉన్న సముద్రం వైపు ఉత్తర కొరియా పలు క్రూయిజ్ క్షిపణులను శనివారం ప్రయోగించింది. (North Korea Fires Several Cruise Missiles) దీంతో కొరియా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. (Amid Tensions) స్థానిక కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 4 గంటలకు ప్రయోగించిన పలు క్రూయిజ్ క్షిపణులను గుర్తించామని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్‌ యోన్‌హాప్ చెప్పారు.

YS Viveka Case : వివేకా హత్య కేసు.. సీబీఐ ఛార్జ్ షీట్ లో కీలక అంశాలు

ఉత్తర కొరియా క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించిందని దక్షిణ కొరియా సైన్యం ధ్రువీకరించింది. బుధవారం రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన తర్వాత తాజాగా మళ్లీ ఉత్తర కొరియా క్రూయిజ్ క్షిపణులను సముద్రంపై ప్రయోగించింది.

Weather Report : హెచ్చరిక .. 24 గంటలు భారీ వర్షాలు..

దక్షిణ కొరియాకు యూఎస్ అణు సాయుధ బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి వచ్చినప్పటి నుంచి ఉత్తర కొరియా క్షిపణులను ప్రయోగిస్తోంది. దక్షిణ కొరియాలో యూఎస్ విమాన వాహక నౌకలు, బాంబర్లు, క్షిపణి జలాంతర్గాములను మోహరించడం అణ్వాయుధాల వినియోగానికి సంబంధించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుందని ఉత్తర కొరియా హెచ్చరించింది.

ట్రెండింగ్ వార్తలు