Parrot Steals Reporter’s Earphone : దోపిడీ గురించి రిపోర్టు చేస్తుండగా.. జర్నలిస్టు ఇయర్‌ఫోన్‌ ఎత్తుకెళ్లిన చిలుక

చిలీ జర్నలిస్ట్ నికోలస్ క్రమ్ ఒక దోపిడీ గురించి రిపోర్టు చేస్తుండగా ఓ చిలుక అతన్ని ఆశ్చర్యపరిచింది. దేశంలోని ఒక ప్రాంతంలో జరిగిన దొంగతనం గురించి మాట్లాడుతున్నప్పుడు చిలుక అతని ఇయర్‌ఫోన్‌ను దొంగిలించిన దృశ్యం కెమెరాకు చిక్కింది.

Parrot Steals Reporter’s Earphone : చిలీ జర్నలిస్ట్ నికోలస్ క్రమ్ ఒక దోపిడీ గురించి రిపోర్టు చేస్తుండగా ఓ చిలుక అతన్ని ఆశ్చర్యపరిచింది. దేశంలోని ఒక ప్రాంతంలో జరిగిన దొంగతనం గురించి మాట్లాడుతున్నప్పుడు చిలుక అతని ఇయర్‌ఫోన్‌ను దొంగిలించిన దృశ్యం కెమెరాకు చిక్కింది. జర్నలిస్ట్ నికోలస్ క్రుమ్ స్థానిక దొంగతనాల పెరుగుదలపై చిలీ విజన్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నప్పుడు అతని భుజంపై ఒక చిలుక కూర్చొని ఇయర్‌పీస్‌ని తీసివేసి ఆశ్చర్యపరిచింది.

ఆ ఇయర్‌పీస్‌ను తిరిగి పొందడానికి, సిబ్బంది పక్షిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. కానీ అది అక్కడి నుంచి ఎగిరిపోయింది. కొంత సమయం తర్వాత ఇయర్‌పాడ్‌ను చిలుక కింద పడేసింది. చివరికి ఇయర్ పాడ్ దొరికిందని స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి. ఈ హాస్యభరితమైన సంఘటన కెమెరాలో చిక్కుకుంది.

Viral Video: టీవీ లైవ్‌లో మైక్ లాక్కెళ్లిన కుక్క.. వెంటపడిన రిపోర్టర్!

జర్నలిస్టు నికోలస్ క్రుమ్ శాంటియాగో డి చిలీలో దొంగతనాలు, భద్రత గురించి ప్రత్యక్షంగా రిపోర్టు చేస్తున్నట్లు కెమెరాలో కనిపించింది. చిలుక తన భుజంపై కూర్చున్నప్పుడు జర్నలిస్టు కెమెరామెన్‌కు సిగ్నల్ ఇచ్చాడు. అప్పుడు పక్షి వేగంగా అకస్మాత్తుగా తన కుడివైపుకి రెండు అడుగులు వేసి ఇయర్ పాడ్ తీసివేసినట్లు వీడియోలో కనిపిస్తోంది.

టెలివిజన్‌లో ప్రత్యక్ష ప్రసారంలో ఎప్పుడూ కనిపించని విచిత్రమైన విషయాలలో ఇది ఒకటి. చాలా మంది ఇంటర్నెట్‌లో ఈ వీడియోను చూసి ఆశ్చర్యపోతున్నారు. వీడియో స్పానిష్‌లో ఉన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రధాన సోషల్ మీడియా నెట్‌వర్క్‌లలో ఈ వీడియోను విస్తృతంగా షేర్ చేశారు.

Viral News : చంటిబిడ్డను ఎత్తుకుని..టీవీ లైవ్‌లో రిపోర్టింగ్

ఈ వీడియోను చూసి యూజర్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే సోషల్ న్యూస్ అగ్రిగేషన్ వెబ్‌సైట్ Redditలో దీనిపై వినోదకరమైన వ్యాఖ్యలను పోస్టు చేస్తున్నారు. న్యూస్ యాంకర్‌ను హాలీవుడ్ స్టార్ ర్యాన్ గోస్లింగ్‌తో పోలుస్తూ “చిలీ ర్యాన్ గోస్లింగ్ తన ఎయిర్ పాడ్‌ను కోల్పోయాడు.” అంటూ వ్యాఖ్యానించారు.

ట్రెండింగ్ వార్తలు