Sri Lanka Crisis: నేను కొనసాగలేను.. శ్రీలంక ప్రధాని విక్రమ సింఘే రాజీనామా.. అదే బాటలో గొటబయ?

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కొనసాగుతున్న వేళ ఆ దేశ కొత్త ప్రధాని విక్రమ సింఘే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని పదవికి నేను రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఆందోళన కారుల కోరిక మేరకు అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాను రాజీనామా చేస్తున్నానని అన్నారు.

Sri Lanka Crisis: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కొనసాగుతున్న వేళ ఆ దేశ కొత్త ప్రధాని విక్రమ సింఘే సంచలన నిర్ణయం తీసుకున్నారు. శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సే నివాసాన్ని వేలాది మంది ఆందోళన కారులు ముట్టడించారు. ఈ క్రమంలో గొటబయ అక్కడి నుంచి పారిపోయారు. అతను దేశం విడిచిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటన అనంతరం క్యాబినెట్ సభ్యులతో సమావేశమైన గొటబయ ప్రధానిగా తాను కొనసాగలేనని అన్నారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో తన ప్రధాని పదవికి నేను రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ఆందోళన కారుల కొరిక మేరకు అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాను రాజీనామా చేస్తున్నానని విక్రమ సింఘే తెలిపారు.

Sri Lanka Crisis: రాజపక్సే నివాసంలో మద్యం బాటిళ్లు.. ఆందోళన కారులు ఏం చేశారో తెలుసా? వీడియోలు వైరల్

గత కొద్దినెలలుగా శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ నిరసనను వ్యక్తంచేస్తున్నారు. పెట్రోల్ కోసం ఆ దేశంలో రోజుల తరబడి బంకుల వద్ద క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తుంది. దేశంలోని పలు ప్రాంతాల్లో తినేందుకు సరియైన ఆహారం కూడా దొరకని పరిస్థితి. ఈ క్రమంలో ప్రజలు రోడ్లపైకొచ్చి అప్పటి ప్రధాని మహింద్ర రాజపక్సేకు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. రాజపక్సే కుటుంబం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆందోళనలు ఉదృతం చేశారు. ప్రజల ఆందోళనలకు తలొగ్గిన మహింద్ర రాజపక్సే తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అనంతరం శ్రీలంకకు కొత్త ప్రధానిగా మే 12వ తేదీన రణిల్‌ విక్రమసింఘే(73) బాధ్యతలు చేపట్టారు.

అధ్యక్షుడు గోటబయా రాజపక్సే దగ్గరుండి మరీ విక్రమసింఘే లంక ప్రధానిగా ప్రమాణం చేయించారు. కాగా లంకకు ప్రధానిగా రణిల్‌ విక్రమసింఘే ఎంపిక కావడం కొత్తేం కాదు. గతంలో దఫాలుగా ఆయన ప్రధాని బాధ్యతలు చేపట్టారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తాను ప్రధానిగా కొనసాగలేనని విక్రమ సింఘే ప్రకటించారు. ఇందుకు సంబంధించి కారణాలను తన ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు. ‘పౌరులందరి భద్రతతో సహా ప్రభుత్వ కొనసాగింపును నిర్ధారించడానికి నేను ఈరోజు పార్టీ నాయకుల ఉత్తమ సిఫార్సును అంగీకరిస్తున్నాను, అఖిల పక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, దీన్ని సులభతరం చేయడానికి నేను ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నాను’ అంటూ తెలిపారు. మరోవైపు.. లంకేయుల నిరసనల నేపథ్యంలో లంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే కూడా రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు