Imran khan Russia Visit : యుక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని సమర్ధించిన ఇమ్రాన్ ఖాన్..యుద్ధం వేళ..రష్యాలో పర్యటన

యుక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని సమర్ధించారు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్..రష్యాకు యుక్రెయిన్ కు మద్య హోరా హోరీగా యుద్ధం జరుగుతున్న వేళ.. రష్యాలో పర్యటనలో ఉన్నారు ఇమ్రాన్ ఖాన్.

pakistha pm imran russia on maiden visit : ఓ పక్క అమెరికాతో సహా ప్రపంచంలోని చాలా దేశాలు యుక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని వ్యతిరేకిస్తుంటే..పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాత్రం సమర్థించారు.యుక్రెయన్ పై రష్యా దాడి చేయటం సరైందే నంటున్నాడు ఇమ్రాన్ ఖాన్. రెండు దేశాల మధ్య హోరా హోరీగా యుద్దం జరుగుతుంటే తాజాగా పాక్ ప్రధాని ఇమ్రాన్ మాత్రం రష్యాలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటన కోసం వెళ్లారు ఇమ్రాన్. రష్యా పర్యటనలో భాంగా బుధవారం (ఫిబ్రవరి 23.2022)న రష్యా రాజధాని మాస్కోకు బయలు దేరారు ఇమ్రాన్. ప్రస్తుతం అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. రష్యా పర్యటన తనకు ఆనందాన్నిస్తోందని తెలిపారు.

Also read :  Russia-Ukraine war: యుక్రెయిన్ గగనతలం మూసివేత..ఖాళీగా వెనుదిరిగిన భార‌త విమానం..!

ఈ పర్యటనలో ఇమ్రాన్ ఖాన్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించడంపై ఇమ్రాన్‌ ఖాన్‌ చర్చలు జరుపనున్నారు. అయితే, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తోపాటు ఇతర దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధిస్తున్న వేళ పాక్‌ ప్రధాని రష్యా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక రెండు దశాబ్దాల తర్వాత ఓ పాకిస్థాన్‌ ముఖ్యనేత రష్యాలో పర్యటించడం కూడా ఇదే తొలిసారి కావడం మరో విశేషం. ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించడం, ఇంధన రంగంలో సహకారాన్ని విస్తరించే అంశాలపై చర్చలు జరుపనున్నారు. వీటితోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు సహా అఫ్గానిస్థాన్‌ పరిస్థితులపైనా విస్తృతంగా చర్చిస్తారని పాక్‌ విదేశాంగశాఖ కార్యాలయం తెలిపింది.

Also read : War in Ukraine: నిముషాల వ్యవధిలో మారిపోతున్న పరిణామాలు: యుక్రెయిన్ వైమానిక, మిలిటరీ స్థావరాలే లక్ష్యమన్న రష్యా

కాగా.. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలోనే పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా అఫ్గాన్‌ నుంచి అమెరికా బలగాలను ఉపసంహరించుకున్న తర్వాత మిలటరీ బేస్‌లను అమెరికాకు ఇచ్చేందుకు పాకిస్థాన్‌ అంగీకరించలేదు. అంతేకాదు..జో బైడెన్‌ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఫోన్‌లో కూడా పాక్‌ ప్రధాని మాట్లాడలేదు. దీంతో యుక్రెయిన్ పై దాడిని అమెరికా వ్యతిరేకిస్తుంటే పాక్ ప్రధాని మాత్రం దాడిని సమర్థించటం ఆసక్తికరంగా మారింది. అంటే పాక్ అమెరికాకు వ్యతిరేకమన్నట్లుగా తెలుస్తోంది. ఈక్రమంలో తన మద్దతు రష్యాకే ఉంటుందని అమెరికాకు సంకేతాలు పంపించేందుకు ఈ పర్యటనను పాక్‌ ప్రధాని ఉపయోగించుకోనున్నట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు