Russia Ukraine War : యుక్రెయిన్‌‌కు సాయం చేస్తానన్న పోలాండ్.. అడ్డుచెప్పిన అమెరికా..!

Russia Ukraine War : అసలే యుక్రెయిన్ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ప్రపంచంలో ఏ దేశమైన సాయం చేయకపోతుందాని ఆశగా ఎదురుచూస్తోంది. రష్యా దాడులు చేస్తున్నా ప్రపంచ దేశాలు మౌనంగా ఉండిపోయాయి.

Russia Ukraine War : అసలే యుక్రెయిన్ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ప్రపంచంలో ఏ దేశమైన సాయం చేయకపోతుందా అని ఆశగా ఎదురుచూస్తోంది. రష్యా దాడులు చేస్తున్నా ప్రపంచ దేశాలు మౌనంగా ఉండిపోయాయి. రష్యాపై ఒంటరిగా పోరాడుతున్న యుక్రెయిన్ దీన పరిస్థితిని చూసి చలించిన ఒకటి రెండు దేశాలు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. అందులో పోలండ్ దేశం ఒకటి.. రష్యాతో యుద్ధంలో యుక్రెయిన్‌కు MiG-29 ఫైటర్ జెట్స్ సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. పోలండ్ ప్రతిపాదనకు అమెరికా అడ్డుచెప్పింది.

అగ్రరాజ్యం సాయం చేయకపోగా.. యుక్రెయిన్‌కు ఫైటర్ జెట్స్ పంపిస్తామని ప్రతిపాదించిన పోలండ్‌ను కూడా అడ్డుకుంది. రష్యాతో యుద్ధంలో యుక్రెయిన్‌కు ప్రత్యక్షంగా అమెరికా సాయం చేయలేకపోయింది. ఇక పరోక్షంగానూ సాయం చేయనివ్వకుండా అడ్డుకుంది. అమెరికా ఎయిర్ బేస్ ద్వారా పోలండ్ తమ MiG-29 ఫైటర్ జెట్లను పంపుతామనే ప్రతిపాదన తీసుకొచ్చింది. అయితే ఆ ప్రతిపాదనను అమెరికా ముందుగానే తోసిపుచ్చింది. యుక్రెయిన్ నాటో దేశాల్లో భాగస్వామిగా ఉండాలని కోరుతోంది. అందుకు రష్యా అంగీకరించడం లేదు. నాటోలో యుక్రెయిన్ చేరితే రష్యాపై తీవ్ర ప్రభావం పడుతుందని భావిస్తోంది. అందుకే యుక్రెయిన్ రష్యాలో కలిపేసుకునేందుకు పుతిన్ ఇంతగా ఆరాటపడుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రష్యాకు నేరుగా అడ్డుచెప్పలేని అమెరికా.. పోలాండ్ వంటి దేశాలను కూడా సాయం చేయనివ్వకుండా ఇలా పరోక్షంగా అడ్డుకుంటోంది.

Russia Ukraine War Us Rejects Poland’s Offer To Send Mig 29 Fighter Jets To Ukraine 

Russia Ukraine War : అలా చేస్తే.. నాటో కూటమికే ముప్పు : 
ఒకవేళ రష్యాను కాదని సాయం చేస్తే.. అప్పుడు మొత్తం నాటో కూటమికే ఆందోళన కలిగిస్తుందని అమెరికా అంటోంది. జర్మనీలో రామ్‌స్టెయిన్‌లో అమెరికా ఎయిర్‌బేస్‌కు చెందిన సోవియట్ కాలం నాటి MiG-29 ఫైటర్‌ జెట్ విమానాలను యుక్రెయిన్‌కు పంపే ప్రతిపాదనను అమెరికా తీవ్రంగా వ్యతిరేకించింది. వాస్తవానికి ఒప్పందం ప్రకారం.. MiG-29 ఫైటర్‌ జెట్లను యుక్రెయిన్‌ పంపడం సాధ్యపడదని స్పష్టం చేసింది. అంతగా అవసరమైతే ఆ విమానాల స్థానంలో F-16 ఫైటర్లను పంపుకోవచ్చునని అమెరికా అంటోంది. పోలాండ్ కు మాత్రం ఈ ఫైటర్ జెట్లను యుక్రెయిన్ కు పంపేందుకు అంగీకరించడం లేదు. అమెరికా‌-నాటో ఎయిర్‌ బేస్‌ నుంచి MiG-29 ఫైటర్‌ జెట్లను పోలాండ్ యుక్రెయిన్‌కు పంపడాన్ని తప్పుబట్టింది.

రష్యా యుద్ధ విమానాలను దీటుగా తిప్పికొట్టాలంటే తమకు మరిన్ని యుద్ధ విమానాలు కావాలంటూ యుక్రెయిన్ అధ్యక్షుడు పోలాండ్ దేశాన్ని పదేపదే అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో పోలాండ్ జర్మనీలోని యూఎస్-నాటో ఎయిర్ బేస్ నుంచి MiG-29 ఫైటర్‌ జెట్లను పంపేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే పోలాండ్, ఇతర NATO మిత్రదేశాలతో సంప్రదింపులు జరుపుతోంది. ఎందుకంటే.. లాజిస్టికల్ సవాళ్లతో కూడిన పోలాండ్ ప్రతిపాదన సమర్థనీయం కాదని పెంటగాన్ ప్రతినిధి జాన్ కిర్బై తెలిపారు. ఇదిలా ఉండగా.. రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం 14వ రోజుకు చేరుకుంది. ఇప్పటికే పలు దాఫాలుగా చర్చలు జరిగినప్పటికీ ఏది యుద్ధం ముగిసే దిశగా అడుగులు పడలేదు. మరోమారు శాంతిపరమైన చర్చలకు ఇరుదేశాలు రెడీ అవుతున్నాయి. ఈసారి చర్చలతోనైనా యుక్రెయిన్, రష్యా యుద్ధానికి ఎండ్ కార్డు పడుతుందో లేదో చూడాలి.

Read Also : Zelensky Compromise : రష్యాతో యుద్ధంపై యుక్రెయిన్ అధ్యక్షుడు రాజీబాట.. నాటోలో చేరేదే లేదన్న జెలెన్‌స్కీ

ట్రెండింగ్ వార్తలు