Space Debris Collision: అంతరిక్షంలో శిథిలాల ఘర్షణ.. దెబ్బతిన్న చైనా శాటిలైట్!

అంతరిక్షంలో అలజడి.. స్పేస్ జంక్షన్.. ఇప్పుడు ఇదే సైంటిస్టులను కలవరపెట్టిస్తోంది. అంతరిక్షంలో విచ్ఛిన్నమైన ఈ శిథిలాల కారణంగా ఉపగ్రహాలు దెబ్బతింటున్నాయి

Space collision: అంతరిక్షంలో అలజడి.. స్పేస్ జంక్షన్.. ఇప్పుడు ఇదే సైంటిస్టులను కలవరపెట్టిస్తోంది. అంతరిక్షంలోకి ప్రయోగించిన అనేక అంతరిక్ష శిథిలాల బెడద వెంటాడుతోంది. అంతరిక్షంలో విచ్ఛిన్నమైన ఈ రాకెట్ల శిథిలాల కారణంగా పనిచేస్తున్న ఉపగ్రహాలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతోంది. అంతరిక్షంలో ఏర్పడే ఈ శిథిలాల ఘర్షణ ప్రభావంతో కక్ష్యల్లో ప్రయాణించే మరెన్నో ఉపగ్రహాలు దెబ్బతింటున్నాయి. తాజాగా రష్యా రాకెట్ శిథిలం కారణంగా చైనా ఉపగ్రహం ఒకటి దెబ్బతిన్నదని అమెరికా అంతరిక్ష విభాగం యుఎస్ స్పేస్ ఫోర్స్ 18th Space Control Squadron (18SPCS) నివేదిక గత మార్చిలో వెల్లడించింది. సెప్టెంబర్ 2019లో చైనా ప్రయోగించిన సైనిక ఉపగ్రహం (Yunhai 1-02) విచ్ఛిన్నమైందని నివేదించింది. అంతరిక్ష నౌక ఏదైనా వైఫల్యానికి గురైందా లేదా అనేది క్లారిటీ లేదు. కానీ, అక్కడ మాత్రం పేలుడు సంభవించినట్టు కనిపిస్తోంది. బహుశా అక్కడి కక్ష్యలో ఏదైనా ఢీకొనడం ద్వారా ఈ పరిస్థితి ఏర్పడి ఉంటుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు.

18SPCS నివేదిక ప్రకారం..
ఈ అప్‌డేట్‌లో ఆబ్జెక్ట్ (48078, 1996-051Q:) శాటిలైట్‌తో ఢీకొట్టినట్టు గుర్తించారు. అయితే గతంలో ఇతర ఉపగ్రహాల విషయంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడలేదని శాటిలైట్ ట్రాకర్ మెక్‌డోవెల్ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి లోతుగా విశ్లేషించేందుకు ట్రాకింగ్ డేటాను పరిశీలించారు. అందులో ఆబ్జెక్ట్ 48078 అనేది ఒక చిన్న అంతరిక్ష శిథిలమని మెక్‌డోవెల్ గుర్తించారు. అది బహుశా 4 అంగుళాలు 20 అంగుళాల వెడల్పు (10 నుంచి 50 సెంటీమీటర్లు) ఉంటుంది. సెప్టెంబర్ 1996లో రష్యాకు చెందిన Tselina-2 గూఢచారి ఉపగ్రహాన్ని Zenit-2 రాకెట్ నుంచి ప్రయోగించారు. ఆ రాకెట్ అంతరిక్షంలో పేలిపోవడంతో ఎనిమిది శిథిలాలు ఏళ్ల తరబడి తిరుగుతున్నాయని ట్రాకింగ్ చేశారు.
China Space‌ Treatment‌ : అంతరిక్షంలో క్యాన్సర్‌ చికిత్స..!ఒకేసారి 1000 ప్రయోగాలకు చైనా పక్కా ప్లాన్

ఆబ్జెక్ట్ 48078లో కేవలం ఒకే రకమైన కక్ష్య డేటా ఉంది. ఈ ఏడాది మార్చిలోనే ఆ డేటాను సేకరించారు. ఇంతకీ ఈ రష్యా రాకెట్ శిథిలం అంతరిక్షంలో ఒకదాన్ని ఢీకొట్టినట్టు డేటాలో గుర్తించారు. అంతరిక్షంలో శిథిలాల మధ్య ఘర్షణ వల్లే జరిగి ఉంటుందని మెక్‌డోవెల్ మరో ట్వీట్‌లో తెలిపారు. మార్చి 18న Yunhai 1-02 శాటిలైట్ విచ్ఛిన్నమైందని డేటాలో గుర్తించారు. Yunhai 1-02 శాటిలైట్, ఆబ్జెక్ట్ 48078 ఒకదానికొకటి 0.6 మైళ్ల (1 కిలోమీటర్) దూరంలో పయనించినట్టు కనుగొన్నారు. ఈ క్రమంలో ఒకదానికొకటి ఢీకొనడం ద్వారా ఏర్పడిన శిథిలాల వస్తువులను దాదాపు 37వరకు ఉన్నాయని ఇప్పటి వరకు కనుగొన్నారు. ఇక 485 మైళ్ల (780 కిలోమీటర్లు) ఎత్తులో ఈ శిథిలాల ఘర్షణ జరిగినట్టు గుర్తించారు. రేడియో ట్రాకర్లు ఉపగ్రహం నుంచి సంకేతాలను కూడా గుర్తించినట్టు మెక్‌డోవెల్ చెప్పారు.

శిథిలాలతో ఉపగ్రహాలకు తీవ్ర నష్టం :
ప్రస్తుతానికి అంతరిక్షంలో స్పేస్ జంక్ సమస్య అంత తీవ్రంగా లేదని అభిప్రాయపడ్డారు. కానీ Yunhai 1-02 దెబ్బతినడమనేది ఒక హెచ్చరిక సంకేతమని మెక్‌డోవెల్ అన్నారు. Object 48078 Zenit-2 రాకెట్‌ను ఢీకొనడంతో  పక్కకు ఒరిగిందన్నారు. అంతరిక్షంలోని చిన్నపాటి శిధిలాలను ట్రాక్ చేయడం కష్టమని చెప్పారు. 0.4 అంగుళాలు 4 అంగుళాల వెడల్పు (1 నుంచి 10 సెం.మీ.) మధ్య సుమారు 9లక్షల శిథిల వస్తువులు మన గ్రహం చుట్టూ తిరుగుతున్నాయని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంచనా వేసింది. అంతరిక్ష కక్ష్యలోని వస్తువులు చాలా వేగంగా కదులుతుంటాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వద్ద ఎత్తులో దాదాపు 17,150 mph (27,600 kph) దూరంలో పయనించే చిన్న చిన్న ముక్కలు కూడా ఉపగ్రహానికి తీవ్ర నష్టం కలిగిస్తాయని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. రాబోయే సంవత్సరాల్లో ఇలాంటి కక్ష్య శిథిలాల సంఖ్య భారీసంఖ్యలో పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
Psychiatric : అంతరిక్షంలో రూ.లక్షల కోట్ల విలువ చేసే ఆ ముక్క..తవ్వి తేవటానికి సైంటిస్టుల ప్లాన్‌

ట్రెండింగ్ వార్తలు