22-year-old millionaire : 17 ఏళ్లకు చదువుకు ఆపేశాడు.. 22 ఏళ్లకు మిలియనీర్ అయ్యాడు.. ఓ యువకుడి సక్సెస్‌ఫుల్ స్టోరి

17 సంవత్సరాలకే చదువులకి ఫుల్ స్టాప్ పెట్టాడు. 22 సంవత్సరాలకే మిలియనీర్ అయ్యాడు. జీవితకాలం తిని కూర్చున్నా తరగని డబ్బును సంపాదించాడు. ఇంత చిన్న వయసులో అతను ఏం చేశాడు? ఎలా ఇంత డబ్బు సంపాదించాడు?

22-year-old millionaire : 17 సంవత్సరాల వయసులో ఓ యువకుడు చదువు ఆపేశాడు. 22 సంవత్సరాలకే మిలియనీర్ అయ్యాడు. ఇక ఏ పనీ చేయకపోయినా జీవితం గడిచిపోయేంతగా డబ్బులు సంపాదించాడు. ఇంత తక్కువ కాలంలో అతను ఈ సక్సెస్ ను ఎలా సాధించాడు?

Assam: ఆరేళ్లుగా జమచేసుకున్న రూ.1, రూ.2, రూ.5 కాయిన్స్ తీసుకెళ్లి.. స్కూటీ కొని అంబరాన్నంటే ఆనందం వ్యక్తంచేసిన యువకుడు

హేడేన్ బౌల్స్ అనే 22 సంవత్సరాల యువకుడి సక్సెస్ ఫుల్ స్టోరీ ఇది. 17 ఏళ్ల వయసు అంటే ఇంకా చదువుకునే వయసు. కానీ అక్కడితో అతను చదువు ఆపేశాడు. ఆన్‌లైన్ కోర్సులను అందించే EcommSeason విద్యా సంస్థను ప్రారంభించాడు. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టాడు. ఇక అక్కడి నుంచి అతనికి ఆదాయం వరదలా ప్రవహించడం మొదలుపెట్టింది. ఎవరైనా 60 ఏళ్ల వయసులో రిటైర్మెంట్‌కి ప్లాన్ చేసుకుంటారు. కానీ అతని వద్ద ఇప్పటికే రిటైర్మెంట్ తీసుకున్నా జీవితకాలానికి సరిపడా డబ్బును సంపాదించగలిగాడు.

Amazon Farest : అమెజాన్ అడవుల్లో తప్పిపోయి..30 రోజులకు బతికిబయటపడ్డ యువకుడు..ఏం తిన్నాడో ఏం తాగాడో తెలిస్తే వాంతి రావాల్సిందే..

హేడేన్ తన విద్యా సంస్థ EcommSeason ద్వారా $4 మిలియన్లు.. రియల్ ఎస్టేట్ పెట్టుబడుల ద్వారా మరో $1.5 మిలియన్లు సంపాదించాడట. ఇక వచ్చిన లాభాలను తన పార్టనర్‌తో కలిసి పంచుకున్నాడట. ఇప్పుడు అతను లంబోర్ఘిని కొనేంత డబ్బు సంపాదించగలిగాడు. అతని సక్సెస్ కి సూత్రాలు ఏంటి అని ఎవరైనా అడిగితే ”ఒక లక్ష్యంతో పని చేయండి .. చేసే పని మీద దృష్టి పెట్టండి.. వచ్చిన దానిని పొదుపు చేయండి.. కేవలం సంపాదన మీదనే దృష్టి పెట్టండి” అని హేడేన్ సూచిస్తున్నాడు. ఇంత చిన్న వయసులో అంత పెద్ద టార్గెట్స్ పెట్టుకుని సక్సెస్ ఫుల్‌గా ముందు సాగిపోతున్న హేడెన్ ఇప్పటి యువతకు నిజంగా ఆదర్శం.

ట్రెండింగ్ వార్తలు