Eiffel Tower : మద్యం మత్తులో రాత్రంతా ఈఫిల్ టవర్ పైనే.. అనుమతి లేని ఎత్తైన ప్రదేశానికి వెళ్లిన ఇద్దరు పర్యాటకులు అరెస్టు

ఈఫిల్ టవర్ మూసివేత సమయంలో భద్రతా సిబ్బంది పర్యాటకులందరినీ కిందికి దించినప్పటికీ నిషిద్ధ ప్రదేశానికి వెళ్లిన ఆ ఇద్దరు పర్యాటకులను గమనించలేదు. దీంతో ఆ ఇద్దరు పర్యాటకులు రాత్రంతా ఈఫిల్ టవర్ పైనే నింద్రించారు.

Eiffel Tower American tourists

American Tourists Stayed On Eiffel Tower : ఫ్రాన్స్ లో ఇద్దరు పర్యాటకులు మద్యం మత్తులో రాత్రంతా ప్రపంచ ప్రఖ్యాత గాంచిన ఎత్తైన ఈఫిల్ టవర్ పైనే ఉన్నారు. అమెరికాకు చెందిన ఇద్దరు పర్యాటకులు మద్యం సేవించి ఆగస్టు13న రాత్రి ఫ్రాన్స్ దేశ రాజధాని పారిస్ లోని అత్యంత ఎత్తైన ఈఫిల్ టవర్ పైకి ఎక్కారు. తాగిన మైకంలో ఆ ఇద్దరు.. పర్యాటకులకు అనుమతి లేని టవర్ లోని అత్యంత ఎత్తులో ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు.

ఈఫిల్ టవర్ మూసివేత సమయంలో భద్రతా సిబ్బంది పర్యాటకులందరినీ కిందికి దించినప్పటికీ నిషిద్ధ ప్రదేశానికి వెళ్లిన ఆ ఇద్దరు పర్యాటకులను గమనించలేదు. దీంతో ఆ ఇద్దరు పర్యాటకులు రాత్రంతా ఈఫిల్ టవర్ పైనే నింద్రించారు. మరుసటి రోజు ఉదయం 9 గంటలకు ఈఫిల్ టవర్ తెరిచేముందు భద్రతా సిబ్బంది గస్తీ తిరుగుతుండగా టవర్ పైన నిషేధిత ప్రదేశంలో ఆ ఇద్దరు పర్యాటకులు నిద్రిస్తుండటాన్ని గమనించారు.

Highest Road in world: ప్రపంచంలోనే ఎత్తయిన రహదారి నిర్మాణానికి శ్రీకారం.. ఎక్కడో తెలుసా?

దీంతో ఉన్నతాధికారులకు సెక్యూరిటీ సిబ్బంది సమాచారం అందించారు. అప్రమత్తమైన ఉన్నతాధికారులు వెంటనే అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ సిబ్బందిని రప్పించి వారిని సురక్షితంగా కిందికి దించారు. అనంతరం పారిస్ పోలీసులు ఆ ఇద్దరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు