Lions Escape from Circus : సర్కస్ బోనులోంచి బయటకొచ్చేసిన సింహాలు .. ప్రేక్షకులు పరుగులు,తొక్కిసలాట

సర్కస్ రంజుగా జరుగుతోంది. ఐరన్ గ్రిల్స్‌తో కూడిన బోనులోకి రెండు సింహాలు వచ్చాయి. ప్రేక్షకులు చప్పట్లతో ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. దీంతో మరింత ఉత్సాహంగా సింహాలను కంట్రోల్ చేసి ఆడించే వ్యక్తులు చేతిలో స్టిక్ పట్టుకుని వాటితో విన్యాసాలు చేయిస్తుండా సింహాలు రెండూ షాకిచ్చాయి.

Lions escape from circus : సింహాలను దగ్గర నుంచి చూడాలని ఉంటుంది. కానీ భయం. అందుకే సర్కస్ లల్లో చూస్తుంటాం. సింహాలు చేసే విన్యాసాలకు చప్పట్లు కొడుతుంటాం. ఎందుకంటే అవి నిర్వాహకుల అదుపులో ఉంటాయి. వారు చెప్పినట్లుగా వింటాయి. కానీ సింహాలు విన్యాసాలు మానేసి బోనులోంచి తప్పించుకుంటే ఎలా ఉంటుంది? వాటిని కంట్రోల్ చేసేవారి మాట వినకుండా అవి ఒక్కసారిగా బయటకొస్తే ఎలా ఉంటుంది. ఇంకేముంది? గుండెలుజారిపోతాయి. కాలికి బుద్ధి చెప్పి పరుగో పరుగులు. అదే జరిగింది చైనాలో.

చైనాలోని హెనాన్ ప్రావిన్స్ లోని లూయాంగ్‌లో సర్కస్ రంజుగా జరుగుతోంది. ఐరన్ గ్రిల్స్‌తో కూడిన బోను (ఎన్ క్లోజర్)రెండు సింహాలు వచ్చాయి. ప్రేక్షకులు చప్పట్లతో ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. దీంతో మరింత ఉత్సాహంగా సింహాలను కంట్రోల్ చేసి ఆడించే వ్యక్తులు చేతిలో స్టిక్ పట్టుకుని వాటితో విన్యాసాలు చేయిస్తున్నాడు. రెండు సింహాలు విన్యాసాలు చేయటానికి ఇష్టపడలేదు. అటూ ఇటూ తెగ తిరిగేస్తున్నాయి. ఇంతలో ఓవ్యక్తి రింగ్ పెట్టి దాంట్లో దూకాలని సింహానికి సూచించాడు. ఓ సింహం దాంట్లోంచి దూకింది. కానీ రింగ్ దాని నడుముకి ఉండిపోయింది. దీంతో అది గందరగోళానికి గురి అయ్యింది. రింగ్ తో పాటు గెంతు పిచ్చి పిచ్చిగా అటూ ఇటూ తిరిగింది. అయినప్పటికీ ఆ సింహాలు బోను లోపల అటూ, ఇటూ పరుగెత్తుతున్నాయే కానీ, చెప్పినట్టు చేయడం లేదు.

చివరికి అవి బోను గేట్ ను బలవంతంగా తెరిచేసుకుని బయటకు వచ్చేశాయి. వాటిని చూసి జనాలు పరుగుపెట్టారు. ఈ సందర్భంగా తొక్కిసలాట కూడా జరిగింది. చుట్టూ జనాలు ఉండడంతో సింహాలకు సైతం ఎటు పోవాలో పాలు పోలేదు. దాంతో అవి అక్కడే ఉండిపోయాయి. చివరికి అవి ఎవరినీ ఏమీ చేయకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ అటువంటి సందర్భాన్ని ఎదుర్కొంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండీ ఈ వీడియోపై ఓ లుక్కేయండీ..

 

 

ట్రెండింగ్ వార్తలు