5th time Twins : 5వ సారి కూడా కవలలకు జన్మనిచ్చిన భార్య..బెంబేలెత్తి వదిలేసిపోయిన భర్త

5వ సారి కూడా భార్య కవల పిల్లలకు జన్మనిచ్చేసరికి ఆ భర్త బెంబేలెత్తిపోయాడు. భార్యా బిడ్డల్ని వదిలేసిపోయాడా భర్త.

Man Abandons Wife After She Gives Birth To 5th Set Of Twins : కట్నం సరిపోలేదనో..లేదా పిల్లలు పుట్టలేదనో..లేదా ఆడపిల్లలు పుట్టారు మగపిల్లలు పుట్టలేదనో కొంతమంది భర్తలు భార్యలకు విడాకులు ఇస్తుంటారు. చిత్రహింసలు పెడుతుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం తన భార్యను ప్రతీ ప్రసవంలోను కవలపిల్లల్ని కంటోంది అని వదిలేసిపోయాడు. ఆమె ఒకసారి రెండుసార్లు కాదు ఏకంగా ఐదవ ప్రసవంలోకూడా భార్య కవలపిల్లలకు జన్మనివ్వటంతో బెంబేలెత్తిపోయిన ఆ భర్త భార్యా పిల్లల్ని వదిలేసి ఎక్కడికి వెళ్లిపోయాడు. దీంట్లో తన తప్పేమి లేకపోయినా పిల్లలతో నానా యానతపడుతోందా మహిళ.

ఆఫ్రికాలోని ఉగాండా దేశంలో నాలోంగో గ్లోరియా అనే మహిళకు వరుసగా ఐదుసార్లు కవలలు పుట్టారు. అలా గ్లోరియా ఇప్పటికే 10 మంది పిల్లలకు తల్లి అయ్యింది. ఐదవ కాన్పులో పుట్టిన పిల్లలతో కలిపి మొత్తం 10మంది పిల్లలు పుట్టేసరికి గ్లోరియా భర్త ఇంతమంది పిల్లల్ని పెంచలేను అని బెంబేలెత్తిపోయి భార్యాపిల్లల్ని వదిలేసి ఎక్కడికో పోయాడు.

భర్త ఇంటిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్లిపోయాడో ఆ మహిళకు ఇంతవరకూ తెలియదు. దీంతో పిల్లలను పెంచే భారం ఆమెపై పడింది. ఇటువంటి దుస్థితిలో గ్లోరియా మీడియాతో మాట్లాడుతూ తాను మూడవసారి గర్భవతిని అయి కవలలకు జన్మనిచ్చినప్పుడు.. ఇదే చాలా ఎక్కువ.. ఇంటి నుంచి వెళ్లిపొమ్మన్నాడని..కానీ ఆ తరువాత బాగానే ఉన్నాడని ఇప్పుడు ఐదవసారి కూడా కవలలు పుట్టేసరికి నా భర్త ఎక్కడికి వెళ్లిపోయాడో తనకేమీ తెలియదని గ్లోరియా ఆవేదనతో తెలిపింది.
ఈ పరిస్థితిపై గ్లోరియా బాధపడుతోంది. ఇకపై అంతా దేముడిదే భారమని ఆవేదన వ్యక్తం చేసింది.

అయితే ఇంత మంది పిల్లలకు జన్మనివ్వడంపై తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని గ్లోరియా స్పష్టం చేసింది. తన పెద్ద పిల్లలు కూడా తనను విడిచిపెట్టి వెళ్లిపోయాడని..అతను ఎక్కడున్నారో తనకు తెలియదని తెలిపింది. ఇటువంటి పరిస్థితిలో గ్లోరియా తన పిల్లలతో పాటు ఉంటున్న ఇంటిని ఖాళీ చేయాలని ఇంటి యజమాని చెప్పటంతో గోరు చుట్టుమీద రోకటిపోటులా ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితితో తల్లడిల్లిపోతోంది గ్లోరియా.

 

ట్రెండింగ్ వార్తలు