Helicopter crash In Ukraine : కుప్పకూలిన హెలికాప్టర్..యుక్రెయిన్ హోంమంత్రితో సహా 18 మంది మృతి

యుక్రెయిన్ లో  హెలికాప్టర్ ప్రమాదం సంభవించింది. హెలికాప్టర్ కుప్పకూలి యుక్రెయిన్ హోంశాఖ మంత్రితో సహా 18మంది మృతి చెందారు.

Helicopter crash In Ukraine : యుద్ధంతో శ్మశానంలా మారిన యుక్రెయిన్ లో  హెలికాప్టర్ ప్రమాదం సంభవించింది. హెలికాప్టర్ కుప్పకూలి యుక్రెయిన్ హోంశాఖ మంత్రితో సహా 18మంది మృతి చెందారు. బుధవారం (జనవరి 18,2023) యుక్రెయిన్ రాజధాని నగరం కీవ్ సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మంత్రి, అతని డిప్యూటీ మంత్రి,రాష్ట్ర కార్యదర్శి, అధికారులు, ముగ్గురు చిన్నారులతో సహా మొత్తం 16మంది మరణించగా ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 18కి పెరిగిందని పోలీసులు వెల్లడించారు. మృతుల్లో కార్యదర్శి కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో మరో 29మంది తీవ్రంగా గాయపడ్డారని కైవ్ ప్రాంతీయ సైనిక పరిపాలనా విభాగం అధిపతి ఒలెక్సీ కులేబా తెలిపారు.

యుక్రెయిన్ రాజధాని కీవ్ నగరానికి ఈశాన్య దిశంలో ఉన్న బ్రోవరీలో స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ఇంటీరియర్ మినిస్టర్ డెనిస్ మొనాస్టైర్స్కీ, ఆయన డిప్యూటీ యెవెన్ యెనిన్, మంత్రిత్వ శాఖ కార్యదర్శి యూరీ లుబ్‌కోవిచ్‌తో పాటు సహా 16 మంది మరణించారని పోలీసు చీఫ్ ఇహోర్ క్లైమెంకో తెలిపారు. మృతుల సంఖ్య 18కి పెరిగింది. వీరిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. హెలికాప్టర్ కిండర్ గార్టెన్ పక్కన కూలిపోవడంతో మంటలు చెలరేగాయి. దీంతో ఆ భవనంలోని చిన్నారులను సిబ్బందిని బయటకు తరలించారు.

అయితే ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే మృతుల సంఖ్య 18కి పెరిగినట్టుగా ఇంటీరియర్ మినిస్ట్రీ తెలిపింది. హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న మంత్రితో కలిపి మొత్తం తొమ్మిదిమంది ఉన్నారు. వీరంతా మరణించారు. ఈ ఘటనలో 10 మంది చిన్నారులు సహా 22 మంది గాయపడ్డారు. వారికి ప్రస్తుతం ఆస్పత్రులలో చికిత్స అందిస్తున్నారు. కాగా ప్రమాదం తీవ్రతను బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

 

ట్రెండింగ్ వార్తలు