Abhishek Sharma : కోహ్లి రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన అభిషేక్ శ‌ర్మ‌.. మంచిరోజులు న‌డుస్తున్నాయ‌ట‌

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతుంది.

Abhishek Sharma – Virat Kohli : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతుంది. ఆ జ‌ట్టు విజ‌యాల్లో ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఆసీస్ ఆట‌గాడు ట్రావిస్ హెడ్‌తో క‌లిసి మెరుపు ఆరంభాల‌ను అందిస్తున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లోనూ దంచికొట్టాడు. కేవ‌లం 28 బంతుల్లో 66 ప‌రుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఆరు సిక్స‌ర్లు బాదాడు. ఈ క్ర‌మంలో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఓ సీజ‌న్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన భార‌త‌ ఆట‌గాడిగా అభిషేక్ శ‌ర్మ చ‌రిత్ర సృష్టించాడు. ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు అభిషేక్ 41 సిక్స‌ర్లు బాదాడు. ఇంత‌క‌ముందు వ‌ర‌కు ఈ రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉండేది. కోహ్లి 2016లో 38 సిక్స‌ర్లు కొట్టాడు. కాగా.. ఈ సీజ‌న్‌లోనూ కోహ్లి రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు ఆడుతూ 37 సిక్స‌ర్లు బాదాడు. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్, బెంగళూరు జ‌ట్లు ప్లేఆఫ్స్‌కు చేరుకోవ‌డంతో అభిషేక్‌, కోహ్లిల‌లో ఎవ‌రు ఎక్కువ సిక్స‌ర్లు కొడ‌తారు అనే విష‌యంపై అందరిలో ఆస‌క్తి నెల‌కొంది.

MS Dhoni : ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్‌పై బిగ్ అప్‌డేట్.. సీఎస్కేకు వీడ్కోలు ఎప్పుడంటే?

ఓ ఐపీఎల్ సీజ‌న్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన భార‌త ఆట‌గాళ్లు వీరే..

అభిషేక్ శ‌ర్మ – 41 సిక్స‌ర్లు – (2024లో)
విరాట్ కోహ్లి – 38 సిక్స‌ర్లు – (2016లో)
విరాట్ కోహ్లి – 37 సిక్స‌ర్లు – (2024లో)
రిష‌బ్ పంత్ – 37 సిక్స‌ర్లు – (2018లో)
శివ‌మ్ దూబె – 35 సిక్స‌ర్లు – (2023లో)

మంచి రోజులు న‌డుస్తున్నాయ్‌..

త‌న బ్యాటింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌పై అభిషేక్ శ‌ర్మ స్పందించాడు. ప్ర‌స్తుత ఐపీఎల్ సీజ‌న్‌లో బ్యాట‌ర్ల హ‌వా న‌డుస్తోంద‌న్నాడు. ప్ర‌స్తుతం త‌న‌కు మంచి రోజులు న‌డుస్తున్నాయ‌న్నాడు. త‌న బ్యాటింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌ను జ‌ట్టు విజ‌యాల కోసం ఉప‌యోగిస్తున్న‌ట్లు చెప్పాడు. పంజాబ్‌తో భారీ ల‌క్ష్యం ఉండ‌డంతో అందుకు త‌గ్గ‌ట్లుగానే బ్యాటింగ్ చేశాన‌ని, ఎలాంటి షాట్లు కొట్టాల‌నే దానిపై పూర్తి స్ప‌ష్ట‌త‌తో ఉన్న‌ట్లు తెలిపాడు. చెత్త బంతుల కోసం వెయిట్ చేసి వాటిని బౌండ‌రీలుగా మ‌లుస్తున్న‌ట్లు చెప్పాడు. ముందుగా బౌల‌ర్ల‌ను కాస్త ఒత్త‌డి గురి చేయాల‌ని, ఆ త‌రువాత మ‌నం అనుకున్న‌ట్లుగా బ్యాటింగ్ చేయోచ్చున‌న్నాడు. ఇక ఎల్ల‌ప్పుడూ అండ‌గా ఉండే అభిమానుల‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు.

IPL 2024 : హైదరాబాద్‌కు కలిసొచ్చిన వర్షం.. క్వాలిఫయర్‌లో తలపడే జట్లు ఇవే.. పూర్తి షెడ్యూల్ ఇలా ..

ట్రెండింగ్ వార్తలు