IPL 2024 : హైదరాబాద్‌కు కలిసొచ్చిన వర్షం.. క్వాలిఫయర్‌లో తలపడే జట్లు ఇవే.. పూర్తి షెడ్యూల్ ఇలా ..

ఐపీఎల్ 2024 సీజన్ లో లీగ్ దశ ముగిసింది. హోరాహోరీగా సాగిన పోరులో నాలుగు జట్లు క్వాలిఫయర్ లో చోటు దక్కించుకున్నాయి.

IPL 2024 : హైదరాబాద్‌కు కలిసొచ్చిన వర్షం.. క్వాలిఫయర్‌లో తలపడే జట్లు ఇవే.. పూర్తి షెడ్యూల్ ఇలా ..

KKR and SRH Teams

IPL 2024 Playoffs : ఐపీఎల్ 2024 సీజన్ లో లీగ్ దశ ముగిసింది. హోరాహోరీగా సాగిన పోరులో నాలుగు జట్లు క్వాలిఫయర్ లో చోటు దక్కించుకున్నాయి. ఆదివారం రాత్రి కోల్ కతా నైట్ రైడర్స్ (KKR), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణం కావడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుకు కలిసొచ్చింది. ఆదివారం హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ , పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరగ్గా హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. దీంతో 14 మ్యాచ్ లలో 17 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలోకి దూసుకెళ్లింది. ఒకవేళ కోల్ కతా వర్సెస్ రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగి రాజస్థాన్ విజయం సాధించి ఉంటే ఆ జట్టు రెండో స్థానంలోకి దూసుకెళ్లేంది. కానీ, ఒక్క బంతి పడకుడానే మ్యాచ్ రద్దు కావడంతో రాజస్థాన్ ఒక్క పాయింట్ తో సరిపెట్టుకుంది. దీంతో 14 మ్యాచ్ లలో హైదరాబాద్, రాజస్థాన్ జట్లు 17 పాయింట్లతో సమానంగా నిలిచాయి. కానీ, రన్ రేట్ విషయంలో హైదరాబాద్ ముందంజలో నిలిచింది. రాజస్థాన్ రన్ రేట్ 0.273 కాగా, హైదరాబాద్ 0.414 రన్ రేట్ తో పాయింట్ల పట్టికలో రెండో స్థానంకు దూసుకెళ్లింది. దీంతో ఒకవేళ క్వాలిఫయర్ -1లో హైదరాబాద్ జట్టు కోల్ కతాపై ఓడిపోయినప్పటికీ క్వాలిఫయర్ -2లో ఆడే అవకాశం దక్కుతుంది.

Also Read : RR vs KKR IPL 2024 : వర్షార్పణం.. రాజస్థాన్‌తో కోల్‌కతా మ్యాచ్ రద్దు.. ఎలిమినేటర్‌లో ఆర్సీబీతో తలపడే జట్టు ఇదే!

  • క్వాలిఫయర్ మ్యాచ్‌ల‌ వివరాలు..
    క్వాలిఫయర్ లో మూడు మ్యాచ్ లు జరగనున్నాయి.
    తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో హైదరాబాద్, కోల్ కతా జట్లు తలపడనున్నాయి.
    మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.
    క్వాలిఫయర్ -2లో క్వాలిఫయర్ -1లో ఓడిపోయిన జట్టు,  ఎలిమినేటర్ లో విజేత జట్టు తలపడనున్నాయి.
    క్వాలిఫయర్-1లో విజేత జట్టు, క్వాలిఫయర్ -2లో విజేత జట్టు మధ్య ఫైనల్ పోరు జరుగుతుంది.

 

Also Read : ఆఖరి మ్యాచ్‌‌లో పంజాబ్‌పై 4 వికెట్ల తేడాతో హైదరాబాద్ విజయం

  • మ్యాచ్‌ల‌ షెడ్యూల్ ఇలా..
    అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మే 21 (మంగళవారం) జరిగే క్వాలిఫయర్ -1 మ్యాచ్ లో కోల్ కతా, హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి.
    అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మే22 (బుధవారం) బెంగళూరు వర్సెస్ రాజస్థాన్ జట్ల మధ్య  ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది.
    క్వాలిఫయర్ -2 మ్యాచ్ 24మే (శుక్రవారం) చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ లో క్వాలిఫయర్ -1లో ఓడిపోయిన జట్టు, ఎలిమినేటర్ లో విజేత జట్టు మధ్య మ్యాచ్ జరుగుతుంది.
    ఫైనల్ మ్యాచ్ ఈనెల 26న (ఆదివారం) చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ లో క్వాలిఫయర్ -1లో విజేత జట్టు, క్వాలిఫయర్ -2లో విజేత జట్టు పోటీ పడతాయి.
    మ్యాచ్ లన్నీ రాత్రి 7.30 గంటల నుంచి ప్రారంభమవుతాయి.