Sreeleela : పిచ్చి పేపర్లు ఏరుకొని మరీ దాచుకున్న శ్రీలీల.. ఎందుకో తెలుసా? ఇలా కూడా చేస్తారా..?
ఈ క్రమంలో ఓ ఆసక్తికర విషయం తెలిపింది శ్రీలీల. (Sreeleela)
Sreeleela
Sreeleela : శ్రీలీల ఇప్పుడు పవన్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా మార్చ్ 19న ఉగాదికి రిలీజ్ కానుంది. శ్రీలీల ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శ్రీలీల ఈ సినిమా గురించి, పవన్ గురించి పలు విషయాలు చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర విషయం తెలిపింది.
శ్రీలీల మాట్లాడుతూ.. ఫస్ట్ డే సినిమాకు వెళ్తే ఫ్యాన్స్ హంగామా ఎక్కువ ఉంటుంది. ఆ రోజు పేపర్లు ఎగరేస్తారు. నా ఫస్ట్ సినిమా పెళ్లి సందడికి ఫ్యాన్స్ పేపర్లు ఎగరేశారు. ఆ ఎగరేసిన పేపర్లు కొన్ని ఏరుకొని నా దగ్గర దాచుకున్నా. ఒక జ్ఞాపకంగా, గుర్తుగా నా ఫస్ట్ సినిమాకు ఎగరేసిన పేపర్లు అని దాచుకున్నా. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కి కూడా పవన్ ఫ్యాన్స్ పేపర్లు ఎగరేస్తారు. అవి కూడా కొన్ని దాచుకుంటాను అని తెలిపింది.
Also Read : Harish Shankar : మూడేళ్లు వాడుకొని ఛాన్స్ ఇవ్వని డైరెక్టర్.. పాపం ఏడ్చేసిన హరీష్ శంకర్..
శ్రీలీల చెప్పిన మాటలు విని ఇలా ఎగరేసిన పేపర్లు కూడా దాచుకుంటారా అని ఆశ్చర్యపోతున్నారు అంతా.
