Surekhavani : ఈతకల్లు తాగుతూ ఎంజాయ్ చేస్తున్న హేమ, సురేఖవాణి.. డైరెక్ట్ చెట్టు నుంచి.. వీడియో వైరల్..
మీరు కూడా హేమ - సురేఖవాణి షేర్ చేసిన వీడియో చూసేయండి.. (Surekhavani)
Surekhavani
Surekhavani : సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులు హేమ, సురేఖవాణి రెగ్యులర్ గా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. కొన్ని వందల సినిమాలు చేసిన ఈ ఇద్దరూ ఇప్పుడు సినిమాలు తగ్గించారు. సినిమాలు తగ్గించినా సోషల్ మీడియా ద్వారా యాక్టివ్ గానే ఉంటున్నారు. తాజాగా హేమ, సురేఖవాణి షేర్ చేసిన ఓ వీడియో వైరల్ గా మారింది.
హేమ, సురేఖవాణి పలువురు ఫ్రెండ్స్ తో కలిసి ఓ తోటలో హాలిడే వెకేషన్ కి వెళ్లారు. వెకేషన్ నుంచి షేర్ చేసిన వీడియోలో.. హేమ, సురేఖవాణి అక్కడ తోటలో ఉన్న ఈత చెట్టు నుంచి వీళ్ళే డైరెక్ట్ గా ఈతకల్లు తీసుకొని, వాటిని వడపోసి తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో ఈ హాలిడే వీడియో వైరల్ గా మారింది.
Also Read : Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్.. పవన్, రాశీఖన్నా, శ్రీలీల.. ఎవరి రెమ్యునరేషన్ ఎన్ని కోట్లు..?
మీరు కూడా హేమ – సురేఖవాణి షేర్ చేసిన వీడియో చూసేయండి..
