Harish Shankar : మూడేళ్లు వాడుకొని ఛాన్స్ ఇవ్వని డైరెక్టర్.. పాపం ఏడ్చేసిన హరీష్ శంకర్..
ప్రస్తుతం హరీష్ ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. (Harish Shankar)
Harish Shankar
Harish Shankar : స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ రైటర్ గా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి తర్వాత దర్శకత్వ శాఖలో పనిచేసి రవితేజ షాక్ సినిమాతో డైరెక్టర్ అయ్యాడు. హరీష్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో మార్చ్ 19న రాబోతున్నాడు. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ తో చేసిన సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ప్రస్తుతం హరీష్ ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. హరీష్ శంకర్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే సినీ పరిశ్రమలోకి వచ్చి సక్సెస్ అయ్యాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో హరీష్ తన కెరీర్ ప్రారంభంలో ఫేస్ చేసిన ఓ సంఘటన తెలిపి ఎమోషనల్ అయ్యారు.
Also Read : Harish Shankar : పవర్ స్టార్ అయిపోయింది.. హరీష్ శంకర్ నెక్స్ట్ టార్గెట్ మెగాస్టార్.. చిరు ఏమంటారో?
హరీష్ శంకర్ మాట్లాడుతూ.. నేను ఘోస్ట్ రైటర్ గా ఒక డైరెక్టర్ దగ్గర మూడేళ్లు పనిచేసాను. రైటర్ గా నేను ఆయనకు చాలా హెల్ప్ చేశాను. మూడేళ్ళ తర్వాత నాకు డబ్బులు కూడా అవసర్లేదు, నేను అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలి, నన్ను తీసుకోండి షూటింగ్ కి వచ్చి నేర్చుకుంటాను అని అంటే నీకు చాలా గ్రిప్ ఉంది సినిమా మీద నిన్ను కచ్చితంగా తీసుకుంటాను అన్నారు. ఆ సినిమా ఓపెనింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది.
ఓపెనింగ్ రోజు ఓ పేపర్ మీద టెక్నిషియన్స్ పేర్లు రాయాలి. లిస్ట్ ఇచ్చి ఆ పని నాకు చెప్పారు. అందరి పేర్లు రాసాక అసిస్టెంట్ డైరెక్టర్ పేర్లు కూడా రాసాను కానీ అందులో నా పేరు లేరు. అది చూసి నాకు ఏడుపు వచ్చేసింది. అక్కడే ఏడ్చేసాను. మూడేళ్లు నా లైఫ్ లో వేస్ట్ అనిపించింది. డైరెక్టర్ నా దగ్గరికి వచ్చి ఆ పేపర్ తీసుకొని ఇవాళ ఓపెనింగ్ కదా నేను కొంచెం బిజీ అని చెప్పేసి వెళ్లిపోయారు. నేను అలాగే ఏడ్చుకుంటూ అన్నపూర్ణ స్టూడియో బయటకు వచ్చేసా అని చెప్తూ ఎమోషనల్ అయ్యారు. అయితే ఆ డైరెక్టర్ ఎవరు అనేది మాత్రం చెప్పలేదు హరీష్.
Also Read : Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్.. పవన్, రాశీఖన్నా, శ్రీలీల.. ఎవరి రెమ్యునరేషన్ ఎన్ని కోట్లు..?
