RR vs KKR IPL 2024 : వర్షార్పణం.. రాజస్థాన్‌తో కోల్‌కతా మ్యాచ్ రద్దు.. ఎలిమినేటర్‌లో ఆర్సీబీతో తలపడే జట్టు ఇదే!

RR vs KKR IPL 2024 : రాజస్థాన్‌, కోల్‌కతా మధ్య జరగాల్సిన చివరి లీగ్ మ్యాచ్‌ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు అయింది. కోల్‌కతాతో హైదరాబాద్ క్వాలిఫయర్‌-1 మ్యాచ్, రాజస్థాన్‌తో ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ తలపడనుంది.

RR vs KKR IPL 2024 : వర్షార్పణం.. రాజస్థాన్‌తో కోల్‌కతా మ్యాచ్ రద్దు.. ఎలిమినేటర్‌లో ఆర్సీబీతో తలపడే జట్టు ఇదే!

RR vs KKR IPL 2024 _ Match Abadoned Due To Rain ( Image Credit : @IPL_Twitter/IPL20)

RR vs KKR IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్‌లో లీగ్ దశ మ్యాచ్‌లకు నేటితో ఎండ్ కార్డు పడింది. రాజస్థాన్‌, కోల్‌కతా మధ్య జరగాల్సిన చివరి లీగ్ మ్యాచ్‌ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు అయింది. గువాహటిలో టాస్‌‌కు ముందు నుంచే వాన కురుస్తోంది. మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. కోల్‌కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న తర్వాత మళ్లీ వర్షం మొదలైంది.

రాజస్థాన్ ఆశలపై నీళ్లు చల్లిన వరుణుడు :
వర్షం కారణంగా టాస్ దాదాపు 3 గంటల 30 నిమిషాలు ఆలస్యం కావడంతో మ్యాచ్‌ను మొదట 7 ఓవర్లకు కుదించారు. అయినప్పటికీ వర్షం తగ్గకపోవడంతో చివరికి మ్యాచ్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. కోల్‌కతాపై రాజస్థాన్ గెలిస్తే క్వాలిఫయర్‌-1కు అర్హత సాధించేది. కానీ, వరుణుడు రాజస్థాన్‌ ఆశలపై నీళ్లు చల్లాడు. మ్యాచ్‌ రద్దుతో ఇరుజట్లకు తలో పాయింట్ దక్కింది. ఏదిఏమైనా రాజస్థాన్, కోల్‌‌కతా మ్యాచ్ రద్దుతో హైదరాబాద్‌కు కలిసొచ్చింది.

టాప్ 2లో హైదరాబాద్.. కోల్‌కతాతో క్వాలిఫయర్‌-1 మ్యాచ్ :
అంతకుముందు, చివరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్.. పంజాబ్ కింగ్స్‌ను ఓడించి రాజస్థాన్ స్థానంలో 17 పాయింట్లతో పట్టికలో ఎస్ఆర్‌హెచ్ రెండో స్థానంలో నిలిచింది. రాజస్థాన్, హైదరాబాద్ ఇరుజట్లు పాయింట్లు వరుసగా 17 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. కానీ, ఈ జట్ల రన్‌రేట్‌లో వ్యత్యాసం ఉంది. రాజస్థాన్ రన్‌రేట్ (+0.273) కన్నా హైదరాబాద్ రన్ రేట్ (+0.414)తో మెరుగ్గా ఉంది.

ఎలిమినేటర్‌లో ఆర్సీబీతో ఆర్ఆర్ పోరు :
అయితే, ఎస్ఆర్‌హెచ్‌తో పోలిస్తే.. ఆర్ఆర్ బలహీనమైన నెట్ రన్ రేట్ కారణంగా పాయింట్ల పట్టికలో టాప్ 3లో నిలిచింది. ముఖ్యంగా, హైదరాబాద్ టాప్-2లో నిలిచింది. ఈ నెల 21న అహ్మదాబాద్‌లో కోల్‌కతా, హైదరాబాద్‌ జట్ల మధ్య క్వాలిఫయర్‌-1 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు నేరుగా ఫైనల్‌కు వెళ్తుంది. ఇక, ఓడిన జట్టుకు మరో ఛాన్స్ దక్కనుంది. మూడో స్థానంలో నిలిచిన రాజస్థాన్‌తో ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ తలపడనుంది.

Read Also : ఆఖరి మ్యాచ్‌‌లో పంజాబ్‌పై 4 వికెట్ల తేడాతో హైదరాబాద్ విజయం