ఆఖరి మ్యాచ్‌‌లో పంజాబ్‌పై 4 వికెట్ల తేడాతో హైదరాబాద్ విజయం

పంజాబ్ కింగ్స్ జట్టుపై హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఆఖరి మ్యాచ్‌‌లో పంజాబ్‌పై 4 వికెట్ల తేడాతో హైదరాబాద్ విజయం

PBKS vs SRH : ఐపీఎల్ 2024లో భాగంగా ఆఖరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ అదరగొట్టింది. సొంతగడ్డ ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ (5 బంతులు మిగిలి ఉండగానే) 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పంజాబ్ నిర్ధేశించిన 215 పరుగులు భారీ లక్ష్యాన్ని ఎస్ఆర్‌హెచ్  19.1 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి సునాయసంగా ఛేదించింది.

ఇప్పటికే ప్లేఆఫ్స్ కు అర్హత సాధించిన హైదరాబాద్ లీగ్ మ్యాచ్‌లో కూడా గెలిచింది. మొత్తం 14 మ్యాచ్‌ల్లో 8 గెలిచి 5ఓడి 17 పాయింట్లతో టాప్ 2 స్థానంలో నిలిచింది. అదే మ్యాచ్‌లో ఓడిన పంజాబ్ జట్టు ఆడిన 14 మ్యాచ్‌ల్లో 5 గెలిచి 9 ఓడి 10 పాయింట్లతో టోర్నీ నుంచి నిష్ర్కమించింది.

ఈ సీజన్‌లో హోమ్ గ్రౌండ్ వేదికగా ఆడిన 7 మ్యాచుల్లో హైదరాబాద్ 5 గెలిచి ఒక మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో ఓటమిపాలైంది. వర్షం కారణంగా గుజరాత్‌తో ఒక మ్యాచ్ రద్దు అయింది.

మరో లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్‌, కోల్‌కతా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ ఫలితంపైనే హైదరాబాద్ స్థానం ఆధారపడి ఉంది. ఒకవేళ, రాజస్థాన్‌ ఓడితే.. హైదరాబాద్‌ టాప్ 2 ప్లేసులోనే ఉంటుంది. హైదరాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించిన అభిషేక్ శర్మ (66)తో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

నాలుగో వికెట్ డౌన్ :
సన్‌రైజర్స్ హైదరాబాద్‌ 176 పరుగుల వద్ద 4వ వికెట్ కోల్పోయింది. నితీశ్ రెడ్డి 25 బంతుల్లో 3 సిక్సర్లు, ఫోర్ తో 37 పరుగులు చేసి హర్షల్ పటేల్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.

అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ
సన్‌రైజర్స్ హైదరాబాద్‌ బ్యాటర్ అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ సాధించాడు. 21 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో అర్ధసెంచరీ బాదాడు. 66 పరుగులు చేసి మూడో వికెట్ గా అవుటయ్యాడు. ఎస్ఆర్‌హెచ్‌ 12 ఓవరల్లో 153/3 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది.

 

ఎస్ఆర్‌హెచ్‌ 5 ఓవర్లలో 72/2
సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఫస్ట్ 5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి రెండో వికెట్‌గా అవుటయ్యాడు. 18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 33 పరుగులు చేసి హర్షల్ పటేల్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.

ట్రావిడ్ హెడ్ గోల్డెన్ డకౌట్
పంజాబ్ కింగ్స్ విధించిన భారీ టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన ఎస్ఆర్‌హెచ్‌కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. విధ్వంసకర ఓపెనర్ ట్రావిడ్ హెడ్ గోల్డెన్ డకౌటయ్యాడు. అర్ష‌దీప్ సింగ్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.

 

ఎస్ఆర్‌హెచ్‌ టార్గెట్ 215
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 214 పరుగులు చేసింది. ఎస్ఆర్‌హెచ్‌కు 215 పరుగుల టార్గెట్ పెట్టింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 71, రిలీ రోసౌవ్ 49, అథర్వ తైడే 46, జితేశ్ శర్మ 32 పరుగులు చేశారు. ఎస్ఆర్‌హెచ్‌ బౌలర్లలో నటరాజన్ 2 వికెట్లు పడగొట్టాడు. కమిన్స్, విజయకాంత్ చెరో వికెట్ తీశారు.

 

శశాంక్ సింగ్ రనౌట్
పంజాబ్ కింగ్స్ బ్యాటర్ శశాంక్ సింగ్ (2) రనౌటయ్యాడు. పంజాబ్ కింగ్స్ 17 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 71 పరుగులు చేసి అవుటయ్యాడు.

150 పరుగులు దాటిన పంజాబ్ స్కోరు
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరుగా దిశగా దూసుకెళ్తోంది. 14 ఓవర్లలో వికెట్ నష్టపోయి 151 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 71, రిలీ రోసౌవ్ 28 పరుగులతో ఆడుతున్నారు.

ప్రభ్‌సిమ్రాన్ సింగ్ హాఫ్ సెంచరీ
పంజాబ్ కింగ్స్ బ్యాటర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ హాఫ్ సెంచరీ సాధించాడు. 34 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. 64 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. అతడికి తోడుగా రిలీ రోసౌవ్ (12) క్రీజ్ లో ఉన్నాడు. పంజాబ్ 12 ఓవర్లలో 129/1 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది.

 

అథర్వ తైడే అవుట్.. ఫస్ట్ వికెట్ డౌన్
97 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. నటరాజన్ బౌలింగ్ అథర్వ తైడే అవుటయ్యాడు. 27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 46 పరుగులు చేశాడు.

5 ఓవర్లలో పంజాబ్ స్కోరు 47/0
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేస్తున్న పంజాబ్ తొలి 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 47 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 26, అథర్వ తైడే 21 పరుగులతో ఆడుతున్నారు.

పంజాబ్ కింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్
SRH vs PKBS: సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుచుంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషన్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో రెండో స్థానమే లక్ష్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ బరిలోకి దిగుతోంది. పంజాబ్ టీమ్‌కు వికెట్ కీపర్ జితేష్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా అతడికిది తొలి మ్యాచ్.

 

తుది జట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్

అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, రాహుల్ త్రిపాఠి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, సన్వీర్ సింగ్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, విజయకాంత్ వియాస్కాంత్, నటరాజన్

పంజాబ్ కింగ్స్
ప్రభ్‌సిమ్రాన్ సింగ్, అథర్వ తైడే, రిలీ రోసౌవ్, శశాంక్ సింగ్, జితేష్ శర్మ (కెప్టెన్ & వికెట్ కీపర్), అశుతోష్ శర్మ, శివమ్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధావన్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, అర్ష‌దీప్ సింగ్‌

ఉప్పల్‌లో ఎస్ఆర్‌హెచ్‌ ఫ్యాన్స్ సందడి
ఎస్ఆర్‌హెచ్‌ ఫ్యాన్స్ పెద్దఎత్తున మ్యాచ్ చూసేందుకు తరలిరావడంతో ఉప్పల్‌ స్టేడియం సమీపంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ రోజు మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్‌ గెలవాలని ఎస్ఆర్‌హెచ్‌ అభిమానులు కోరుకుంటున్నారు. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించకుండా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

 

హైదరాబాద్‌కు మరోసారి భారీ వర్ష సూచన
హైదరాబాద్‌ నగరంలో ఆదివారం సాయంత్రం వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో క్రికెట్ లవర్స్ టెన్షన్ అవుతున్నారు. మ్యాచ్ ముగిసే వరకు వర్షం రాకూడదని కోరుకుంటున్నారు. వర్షం కారణంగా ఇంతకుముందు ఎస్ఆర్‌హెచ్‌, గుజరాత్ మ్యాచ్ రద్దయిన సంగతి తెలిసిందే.