Deepika Padukone : బేబి బంప్‌తో ఓటేయడానికి వచ్చిన దీపికా పదుకోన్
నటి దీపికా పదుకోన్ సైతం ఓటు వేసేందుకు తన భర్త రణవీర్ సింగ్ తో కలిసి ముంబైలోని పోలింగ్ స్టేషన్‌కు వచ్చింది.
- Thota Vamshi Kumar
- Published On : May 20, 2024 / 02:15 PM IST
Deepika Padukone baby bump : లోక్‌సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్ సోమవారం ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. సామాన్యులతో పాటు పలువురు సెలబ్రెటీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ సైతం ఓటు వేసేందుకు తన భర్త రణవీర్ సింగ్ తో కలిసి ముంబైలోని పోలింగ్ స్టేషన్‌కు వచ్చింది. తెల్లటి చొక్కా, నీలిరంగు జీన్స్ ధరించిన దీపికా.. బేబి బంప్ తో కనిపించింది.
కారు దిగి ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌కు వెలుతున్న సమయంలో డాన్ 3 నటుడు రణవీర్ సింగ్ ఆమె చేతిని పట్టుకుని జాగ్రత్తగా తీసుకువెలుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Kajal Aggarwal : బాబు పుట్టిన రెండు నెలలకే.. ఆ సినిమా కోసం చాలా పెయిన్ అనుభవించాను..
బాలీవుడ్ నటులు అయిన రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకోన్ లు 2018లో పెళ్లి చేసుకున్నారు. సెప్టెంబర్‌లో దీపిక మొదటి బిడ్డకు జన్మనివ్వబోతుంది.
ఇదిలా ఉంటే.. దీపికా ప్రతిష్టాత్మక మూవీ కల్కి 2898ADలో నటిస్తోంది. ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. 27 జూన్ 2024న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
#WATCH | Maharashtra: Actors Ranveer Singh and Deepika Padukone arrive at a polling station in Mumbai to cast their vote for the fifth phase of #LokSabhaElections2024 pic.twitter.com/IHH6h8NESg
— ANI (@ANI) May 20, 2024
